ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jun 20, 2022, 2:58 PM IST

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

..

  • రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు: చంద్రబాబు
    Chandrababu: తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని.. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CHALO NARSIPATNAM: 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చిన తెదేపా.. పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు
    CHALO NARSIPATNAM: అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ.. తెలుగుదేశం శ్రేణులు 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చారు. అయ్యన్న కుటుంబానికి సంఘీభావంగా కొందరు తెలుగుదేశం నేతలు రాత్రంతా ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో నర్సీపట్నంను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే తెదేపా నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • DIED: నీటిలో మునిగి పెద్దకోట్ల గ్రామ వీఆర్వో మృతి..
    DIED: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీఏబీఆర్ జలాశయంలో మునిగి ఓ వీఆర్వో మృతి చెందారు. అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • BIRTHDAY CELEBRATIONS: ఆరని తండ్రి.. కంట తడి
    BIRTHDAY CELEBRATIONS: ఆ తండ్రికి ఆడపిల్ల పుడితే లక్ష్మిదేవి పుట్టిందని మురిసిపోయాడు. పుట్టిన దగ్గరనుంచి గుండెల మీద పెట్టుకొని గారాబం చేశాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్లడ్ క్యాన్సర్​తో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతం. కూతురు పుట్టినరోజు సందర్భంగా కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భర్త విలేజ్ సెక్రటరీ.. 'సర్పంచ్'గిరీ కోసం ముగ్గురు భార్యల రాజకీయం.. చివరకు..
    ఆ ప్రభుత్వ ఉద్యోగికి ముగ్గురు భార్యలు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వారంతా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అతడు మాత్రం అధికారులకు ఇద్దరు భార్యల వివరాలే ఇచ్చాడు. దీంతో ఎన్నికల అధికారులు.. అది గుర్తించి అతడిని సస్పెండ్​ చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Live Video: రేసింగ్​​ చేస్తూ రెండు బైకులు ఢీ.. స్పాట్​లోనే ఇద్దరు..
    bike race accident in kerala: కేరళ తిరువనంతపురంలో బైక్​ రేసింగ్​ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైకులు వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి షాక్​.. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన కూటమి
    ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. మేక్రాన్​కు గట్టి షాక్​ తగిలింది. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆయన​ కూటమి మెజారిటీని కోల్పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నివీరుల'కు ఆనంద్​ మహీంద్రా బంపర్​ ఆఫర్​
    Anand Mahindra Offer: త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా స్పందించారు. హింసాత్మక ఆందోళనలు విచారకరమని అన్నారు. ట్విట్టర్​ వేదికగా అగ్నివీరులకు ఓ బంపర్​ ఆఫర్​ కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీ, బన్స్​ సప్లయర్​గా మాజీ క్రికెటర్.. కష్టాలు చూడలేక...
    ఆర్థిక సంక్షోభంతో పొరుగు దేశం శ్రీలంక అవస్థలు పడుతోంది. లక్షల మంది తిండలేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ రోషన్ మహానమ. పెట్రోల్ బంక్​ల వద్ద గంటలు, రోజుల కొద్దీ బారులు తీరిన ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ.. తన మంచి మనుసును చాటుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలయ్య 'అన్​స్టాపబుల్'​ సీజన్-2​ రెడీ.. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​
    Unstoppable with NBK talk show: ఓటీటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకుంది బాలకృష్ణ 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే' టాక్​ షో. ఇటీవలే తొలి సీజన్​ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్​కు సన్నద్ధమవుతోంది.​ అయితే తాజాగా ఈ రెండో సీజన్​ ప్రారంభంపై అప్డేట్​ ఇచ్చింది ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.