ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM

author img

By

Published : Dec 8, 2021, 2:59 PM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు @3PM

  • సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్..
    తమిళనాడు కూనూర్​లో ఓ శిక్షణ హెలికాప్టర్​ కుప్పకూలింది. త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ​పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ విషయంలో బలవంతం చేయబోం : సీఎం జగన్‌
    ముఖ్యమంత్రి జగన్ ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలన్న ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి'
    పంటలకు కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు రాజ్యసభ శూన్యగంటలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "సీఎం జగన్‌ అధ్యక్షతన అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి"
    విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. తమ పోరాటానికి ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షత వహించి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని నేతలు డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాలుగోసారి గర్భం రావడం నచ్చక ఇంట్లోనే ప్రసవం- ఆ తర్వాత..
    పిల్లల్ని కనేందుకు ఇష్టపడని ఓ మహిళ.. ప్రసవం సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇంట్లోనే ప్రసవించగా.. మృత శిశువు జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శబరిమలలో అన్నదానం కోసం భారత్ బయోటెక్ ఎండీ విరాళం
    భారత్​ బయోటెక్​ ఎండీ డా. కృష్ణ ఎల్ల మంగళవారం.. సతీసమేతంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం.. ఆయన అన్నదానం కార్యక్రమం కోసం ఆలయానికి రూ. కోటి విరాళం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నడిరోడ్డుపై మహిళలను వివస్త్రలను చేసి దాడి
    మానవత్వం మంటగలిసింది. బహిరంగంగా.. నలుగురు మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు కొందరు వ్యక్తులు. బాధితులు.. ఎంత ప్రాధేయపడినా నిందితులు విడిచిపెట్టలేదు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలను కుదిపేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • '5జీ వస్తేనే ప్రజలందరికీ డిజిటల్​ విప్లవ ఫలితాలు'
    ఐదో తరం సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో డిజిటల్​ విప్లవాన్ని కొత్తపుంతలు తొక్కించవచ్చని రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ అన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే.. ప్రజలకు డిజిటల్​ విప్లవ ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహిళా హాకీ క్రీడాకారిణికి కరోనా.. కొరియాతో మ్యాచ్ రద్దు
    మహిళల ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం భారత్-దక్షిణా కొరియా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భారత జట్టులో ఒకరికి కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్​ను అధికారులు రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్​ఆర్​ఆర్'​ భీమ్​ గ్లింప్స్​.. చిరు 'భోళాశంకర్'​ అప్డేట్​
    కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​, చిరంజీవి 'భోళాశంకర్​' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.