ETV Bharat / city

Suryapet Ragging Case Updates: సూర్యాపేట ర్యాగింగ్ కేసులో.. 13 మంది విద్యార్థులు అరెస్టు

author img

By

Published : Jan 6, 2022, 12:30 PM IST

Suryapet Ragging Case Updates
Suryapet Ragging Case Updates

Suryapet Ragging Case Updates : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సూర్యాపేట విద్యార్థి ర్యాగింగ్​ కేసులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. జనవరి 2వ తేదీన రాత్రి.. కళాశాల వసతి గృహానికి ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పిలిపించి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిన సంగతి తెలిసిందే.

Suryapet Ragging Case Updates : తెలంగాణలోని సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో 13 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సర విద్యార్థులపై ఆరు కేసులు నమోదయ్యాయి.

అసలేం జరిగిందంటే..
13 Students Arrest in Suryapet Ragging Case : సూర్యాపేట వైద్యకళాశాలలో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. వసతిగృహంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతోపాటు దాడికి పాల్పడ్డారని విద్యార్థి ఆరోపించారు. గుండు గీసేందుకు యత్నించారని.. తప్పించుకుని వెళ్లి తండ్రికి ఫోన్ చేసినట్లు బాధితుడు తెలిపారు.

బాధితుడి తండ్రి వెంటనే 100కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనలో ఉన్న బాధితుడిని ఠాణాకు తరలించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. బాధితుడు, అతడి తండ్రి ఆరోపించారు. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

Suryapet Student Ragging Case : సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్​కు పాల్పడిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 2న సూర్యాపేట మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిని హాస్టల్ గదిలో నిర్భంధించి ర్యాగింగ్​కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ ఈ అంశానికి సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.