ETV Bharat / city

ప్రధాన వార్తలు @11AM

author img

By

Published : Feb 9, 2021, 11:01 AM IST

ప్రధాన వార్తలు @11AM
ప్రధాన వార్తలు @11AM

.

  • పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • షామియానాలో పోలింగ్ బూత్​లు ఏర్పాటు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి గోపాలపురం పాఠశాల వద్ద.. షామియానాలో పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేశారు. మండలంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కృష్ణాజిల్లాలో పోలింగ్‌ ప్రారంభం

కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిడమానూరులో పోలింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఓటరు స్లిప్పులపై పార్టీ మద్దతు గుర్తులు.. అభ్యర్థుల ఆందోళనలు

ఓటరు స్లిప్పులపై అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్న ఘటన.. చిత్తూరులోని కమ్మకండ్రిగలో జరిగింది. దీంతో సర్పంచి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని..సర్పంచి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉత్తరాఖండ్​ విలయంపై రాజ్యసభలో అమిత్​ షా ప్రకటన!

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో హిమనీనదాలు విరిగిపడి జల విలయం సంభవించిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఉదయం 11.30 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఎర్రకోట ఘటన' కేసులో దీప్​ సిద్ధూ అరెస్ట్​

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూను పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ జౌనపుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జలాల్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని త్రిలోచన్​ బజార్​ సమీపంలో ట్రక్కు, కారు​ ఢీకొన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • టీకాల సామర్థ్యంపై డబ్య్లూహెచ్​ఓ అనుమానం!

కొవిడ్​ టీకాల పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన టీకాలు వైరస్​పై సరిగా పని చేస్తున్నాయా ? లేదా ? అని ప్రశ్నించింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగు చూసిన కొత్త రకంపై ప్రస్తుతం ఉన్న టీకాల ప్రభావం తక్కువే అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'రిషభ్​ పంత్​' సెంటిమెంట్​ భారత్​కు కలిసొచ్చేనా!

టెస్టుల్లో పంత్​ సెంచరీ చేజారిన మూడు సార్లు టీమ్​ఇండియా విజయాలను అందుకోగా.. మరో మ్యాచ్​ డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్​తో జరుగుతున్న ప్రస్తుత టెస్టులోనూ పంత్​ తొలి ఇన్నింగ్స్​లో 91 పరుగులకు ఔటయ్యాడు. మరి అయిదవ సారి సీన్​ రిపీట్​ అవుతుందా! పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సూర్య, విక్రమ్‌, అజిత్‌ వాయిస్​తో నాన్​స్టాప్ డైలాగ్స్!

తమిళ, మలయాళ స్టార్ హీరోలు మోహన్​లాల్, సూర్య, విక్రమ్, అజిత్​లకు డబ్బింగ్ చెబుతూ అందర్నీ అలరించారు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న ఆయన ఒకేసారి పలువురు హీరోల గొంతులు వినిపించి ఆకట్టుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.