ETV Bharat / bharat

10 ఏళ్ల బాలుడి హత్య.. 29 ఏళ్ల తర్వాత తీర్పు.. దోషికి జీవిత ఖైదు

author img

By

Published : Jun 23, 2023, 11:05 PM IST

29 సంవత్సరాల నాటి కేసులో ఓ వ్యక్తికి తాజాగా శిక్ష విధించింది న్యాయస్థానం. 10 ఏళ్ల బాలుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన కేసులో ఒకరికి జీవిత ఖైదు విధించింది. ఝార్ఖండ్​లో ఈ ఘటన జరిగింది.

verdict-in-10-year-old-boy-murder-case-after-29-years-dhanbad-district-session-court-jharkhand-jharkhand
10 ఏళ్ల బాలుడి హత్య కేసులో 29 ఏళ్ల తర్వాత తీర్పు

10 ఏళ్ల వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటనలో.. ఓ వ్యక్తికి 29 సంవత్సరాల తర్వాత శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది జిల్లా కోర్టు. స్కూల్​కెళ్లి తిరిగి వస్తున్న చిన్నారిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్​లోని ధన్​బాద్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..
1994 మార్చి 12న షానవాజ్ అనే బాలుడు.. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కిడ్నాప్​కు గురయ్యాడు. అప్పుడు అతని వయసు 10 సంవత్సరాలు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో రెండవ తరగతి చదువుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు అతడ్ని కిడ్నాప్​ చేశారు. అనంతరం షానవాజ్ కుటుంబ సభ్యుల నుంచి రూ. 50వేలు డిమాండ్ చేశారు. షానవాజ్ కుటుంబ సభ్యులు ఆ డబ్బు ఇవ్వకపోవడం వల్ల.. కిడ్నాపర్లు బాలుడిని కత్తితో పొడిచి చంపేశారు. ముస్తాక్, లద్దన్ వాహిద్, అఫ్తాబ్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. షానవాజ్​ను కిడ్నాప్​ చేసి చిర్కుందలోని దామోదర్ నది వద్దకు కారులో తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అనంతరం కారులో నుంచి బాలుడిని బయటకు లాగి కత్తితో పొడిచి చంపారని వారు వెల్లడించారు.

verdict-in-10-year-old-boy-murder-case-after-29-years-dhanbad-district-session-court-jharkhand-jharkhand
బాధితుడు షానవాజ్

కిడ్నాప్ విషయంపై బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం రాగానే.. బాలుడి తండ్రి షరాఫత్ హుస్సేన్ ఝరియా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకు కిడ్నాప్​ చేశారని.. రూ.50వేలు డిమాండ్​ చేస్తున్నారని వారికి వెల్లడించాడు. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే.. తన కొడుకును చంపేస్తామని బెదిరిస్తున్నట్లుగా పోలీసులకు వివరించాడు. ఘటనపై పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచారు పోలీసులు.

verdict-in-10-year-old-boy-murder-case-after-29-years-dhanbad-district-session-court-jharkhand-jharkhand
నిందితుడు ముస్తాక్

గురువారం ఈ కేసుపై చివరి విచారణ జరిగింది. ముగ్గురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించింది జిల్లా కోర్టు. నిందితుడు ముస్తాక్ అన్సారీ అలియాస్ మున్నా మియాన్‌ను.. దోషిగా నిర్ధరిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సుజిత్ కుమార్ సింగ్ తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగానే కొద్ది రోజుల క్రితం మరో ఇద్దరు నిందితులైన.. లద్దన్ వాహిద్, అఫ్తాబ్ కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. దీనిపై కూడా షానవాజ్ కుటుంబ సభ్యులు.. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి నిందితులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 29 ఏళ్లు గడిచిన తరువాత కూడా.. దోషుల్లో ఒకరికి శిక్ష పడడం మాకు సంతోషంగా ఉందని షానవాజ్ సోదరుడు మహ్మద్ ఇంతాకాబ్ తెలిపాడు. మిగతా ఇద్దరికి కూడా శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

verdict-in-10-year-old-boy-murder-case-after-29-years-dhanbad-district-session-court-jharkhand-jharkhand
షానవాజ్ కుటుంబ సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.