ETV Bharat / bharat

ప్రియురాలి కోసం వచ్చిన యువకుడి హత్య.. గుండు కొట్టి, చితకబాది చంపిన కుటుంబ సభ్యులు

author img

By

Published : Jun 23, 2023, 6:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ యువకుడిని దారుణంగా కొట్టి, చంపారు నలుగురు వ్యక్తులు. ప్రియురాలిన కలిసేందుకు వచ్చిన అతడికి గుండు కొట్టించి, నోట్లో వస్త్రాలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

youth-beaten-to-death-in-uttapredesh-young-man-murdered-who-came-to-meet-girlfriend
ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడి హత్య

ప్రియురాలి కోసం వచ్చిన ఓ యువకుడిని దారుణంగా కొట్టి, చంపారు ఆమె కుటుంబ సభ్యులు. అతడికి గుండు కొట్టించి, నోట్లో వస్త్రాలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. చనిపోయే వరకు చితకబాదారు. అనంతరం తమ ఇంట్లోకి రాత్రి ఓ దొంగ వచ్చాడని.. అతడ్ని పట్టుకుని కొట్టినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేహత్ కొత్వాలి పరిధిలోని మహోఖర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. దీనిపై శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఉత్తమ్​, హరిలాల్​తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు.. నందు అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే యువకుడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.

నందుకు అదే గ్రామానికి చెందిన మహిళతో రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం ఉందన్న విషయం.. తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ తరచుగా కలుసుకునేవారని.. మహిళ ఇంటికి అప్పుడప్పుడు నందు వెళ్లేవాడని వెల్లడించారు. గురువారం రాత్రి కూడా నందుకు ఆ మహిళ ఫోన్ చేసిందని.. అనంతరం ఇంటికి రమ్మని పిలిచిందని వారు పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ ఇంటికి నందు వెళ్లాడని.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి.. నందుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

"ఇదే గ్రామానికి చెందిన ఉత్తమ్​ అనే వ్యక్తి.. ట్రక్కులోంచి ఇటుకలు దింపాలని గురువారం రాత్రి నందును తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రంతా నందు ఇంటికి రాలేదు. అతడు ఇంకా పనిలోనే ఉండొచ్చని మేమంతా భావించాం. శుక్రవారం ఉదయం నందును చనిపోయేంతగా కొట్టినట్లు మాకు తెలిసింది. ఉత్తమ్​ ఇంకా అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. డబ్బుల విషయంలోనే నందును హత్య చేశారు. మహిళతో నందుకు సంబంధం ఉందన్నది అవాస్తవం." అని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘటనలో నలుగురి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. ఆ మహిళ భర్త, ఆమె బావను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపులు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య..
ఆస్తి తగాదాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త, భార్య, వాళ్ల కూతురు మృతిచెందారు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో శుక్రవారం ఉదయం ఈ దారుణం జరిగింది. మృతులను మహదేవస్వామి(42), సవిత(33), సించన (15)గా పోలీసులు గుర్తించారు. వీరంతా బేదర్‌పుర్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్​ కూడా లభించిందని పోలీసులు పేర్కొన్నారు. అందులో మహదేవస్వామి సోదరీమణుల పేర్లు ఉన్నాయని.. వారిని శిక్షించాలని రాసి ఉందని వారు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.