ETV Bharat / bharat

యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ ఐడీలు పనిచేయవు! కారణం ఏంటంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 5:30 PM IST

NPCI UPI Payment Latest Update : ఈ రోజుల్లో నగదుతో చేసే చెల్లింపుల కంటే యూపీఐ యాప్‌లతో చేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడైనా, సురక్షితంగా నగదు ట్రాన్స్‌ఫర్‌ అవుతుండటంతో ఎక్కువ మంది ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా.. ఫోన్‌ పే, గూగుల్ పే యూజర్స్‌కు కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

NPCI UPI Payment Latest Update
NPCI UPI Payment Latest Update

NPCI UPI Payment Latest Update : ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండటంతో ఈజీగా ఆన్‌లైన్ పేమెంట్‌లను చేస్తున్నారు. ఆన్​లైన్​ పేమెంట్స్​ చేసే యాప్స్​లో.. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్‌ ముందు వరసలో ఉంటాయి. అయితే ఈ థర్డ్‌ పార్టీ యాప్‌లను వినియోగించాలంటే తప్పనిసరిగా యూపీఐ ఐడీ ఉండాలి. ఈ ఐడీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇస్తుంది. తాజాగా యూపీఐ యాప్‌ల వినియోగంపై ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలోని వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

NPCI New Guidelines : ఏడాదికిపైగా పని చేయకుండా ఉన్న అన్ని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని యూనిఫైడ్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా థర్డ్‌ పార్టీ యాప్‌లు, (ఫోన్ పే, గూగుల్ పే లాంటివి), బ్యాంకులను ఆదేశించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు లేదా PSP అప్లికేషన్ల నుంచి ఏడాది కాలంగా ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్లు జరపని వారి యూపీఐ ఐడీలు సహా యూపీఐ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని స్పష్టం చేసింది.

యాప్‌లలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ ఛేంజ్ వంటివైనా కచ్చితంగా చేయాలని NPCI యూజర్లను కోరింది. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి కస్టమర్లు ఈ యూపీఐ ఐడీల వివరాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

ఎందుకు ఈ నిర్ణయం అంటే?: పని చేయని యూపీఐ ఐడీలను డీయాక్టీవేట్‌ ఎందుకు చేస్తున్నామనే విషయాన్ని NPCI తెలిపింది. ఎందుకంటే కొందరు కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్న తరవాత పాత సిమ్ కార్డును ఉపయోగించరు. దీని వల్ల ఆ సిమ్‌ కార్డ్‌ను నెట్వర్క్ కంపెనీలు మూడు నుంచి ఆరు నెలల వ్యవధి తరవాత ఇతరులకు కేటాయిస్తుంది. ఈ ఉపయోగించని ఫోన్ నంబర్ బ్యాంకుల్లో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి, ఒకరికి చేరాల్సిన నగదు మరొకరికి ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. అందుకే పని చేయని యూపీఐ ఐడీలను డిసెంబర్ 31లోగా యాక్టీవేట్ చేసుకోవాలని చెప్పింది. బ్యాంకుల్లో ఇచ్చిన నంబర్లు, యూపీఐ ఐడీ యాక్టివేట్ అయి ఉండే నంబర్లు ఒకటిగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఫోన్ నంబర్ వేరు, యూపీఐ ఐడీ వేరుగా ఉంటే గమనించి వాటిని డీయాక్టివేట్ చేయాలని చెప్పింది.

బ్యాంకింగ్ వ్యవస్థతో వారి యూపీఐ సమాచారాన్ని కూడా ధ్రువీకరించుకోవాలని వెల్లడించింది. ఇలా చేయడం వల్ల డిజిటల్ లావాదేవీలకు మరింత రక్షణ, భద్రత చేకూరుతుందని అభిప్రాయపడింది. చాలా మంది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తమ పాత మొబైల్ నంబర్లను తీసేయకుండానే.. కొత్త మొబైల్ నంబర్లను యాడ్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని NPCI తెలిపింది. అన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులు, యూపీఐ యాప్స్ నుంచి ఏడాదికిపైగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని కస్టమర్ల ఫోన్ నంబర్లు లేదా యూపీఐ నంబర్లకు లింక్ అయి ఉన్న యూపీఐ ఐడీల్ని గుర్తించాలని NPCI తెలిపింది.

How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్​ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా!

How to Enable AutoPay Feature in UPI Apps : మీ ఫోన్​లో 'AutoPay'ను ఇలా సెట్ చేసి.. మంత్లీ బిల్లులు ఈజీగా చెల్లించండి.!

How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.