ETV Bharat / bharat

భర్త శాడిజం.. భార్యకు నరకం.. 11ఏళ్లుగా గదిలో బందీ

author img

By

Published : Mar 1, 2023, 10:55 PM IST

Lawyer locked his wife in Dark room
11ఏళ్లుగా ఇంట్లోనే నిర్భంధం

Lawyer locked his wife in Dark room: తన న్యాయవాద వృత్తిని అడ్డంపెట్టుకుని కట్టుకున్న భార్యను 11 ఏళ్లుగా బయట ప్రపంచానికి దూరం చేశాడు ఆ ప్రబుద్ధుడు. కూతురును గురించి తెలుసుకునే వీల్లేక తల్లిదండ్రులు చివరగా పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ అభాగ్యురాలికి చీకటి గది నుంచి విముక్తి కల్పించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

Lawyer locked his wife in Dark room 11years: ఆయన ఓ న్యాయవాది.. పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న అతడు ఆ వృత్తికే కళంకం తెచ్చే పని చేశాడు. తన తల్లి, సోదరుడి మాటలు వినీ.. తాళి కట్టిన భార్యను ఏకంగా 11 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించాడు. ఆమెను బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాల పాటు కఠినమైన జీవితాన్ని అనుభవించింది ఆ మహిళ. తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ప్రబుద్ధుడు గోదావరి మధుసూదన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు తన భార్యను చీకటి గదిలో ఉంచడానికి కారణం ఎంటో తెలుసుకుంటే ఆశ్చర్య కరమైన నిజాలు బయట పడ్డాయి.

11 ఏళ్లుగా భార్యను బాహ్యా ప్రపంచానికి దూరం చేసిన భర్త

శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకి, విజయనగరంలోని కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మధుసూదన్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అయితే తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి, తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను చీకటి గదిలో 11 సంవత్సరాలు పాటు బంధించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అడిగిన తన న్యాయవాది వృత్తిని అడ్డం పెట్టుకొని బాధితురాలు కుటుంబ సభ్యులను బెదిరించేవాడు.

అసలు తమ కుమార్తె ఏమైందో తెలియక ఆమె తల్లిదండ్రు 11 సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించారు. చవరకు సహనం కోల్పోయిన బాధితురాలు తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో తన ఇంటిని తనిఖీ చేసే అధికారం పోలీసులకు లేదంటూ వారిని బెదిరించే ప్రయత్నం చేశాడు. తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు, బాధితురాలు తల్లిదండ్రులు న్యాయస్థానం ఆశ్రయించారు. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు. సెర్చ్ వారెంట్​తో పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేశారు. సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో పోలీసుల కంట పడింది. ఆమె చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. వెంటనే పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం సాయి ప్రియను న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని విజయనగరం ఒకటవ పట్టణ పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.