ETV Bharat / bharat

కుమార్తెల కళ్ల ముందే తండ్రి దారుణ హత్య

author img

By

Published : Nov 22, 2021, 5:10 PM IST

బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేసే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి​ ఇంట్లోకి దుండగులు చొరబడి.. ఇద్దరు కూతుళ్ల ముందే అతడిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Father killed in front of daughter
కూతుళ్ల కళ్ల ముందే తండ్రి హత్య

కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు దుండగులు.. ఓ వ్యక్తిని అతని ఇద్దరి కుమార్తెల ముందే కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

గాంధీ కృషి విజ్ఞాన కేంద్రలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 46ఏళ్ల దీపక్​ కుమార్​ అనే వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కూతుళ్లతో వీర్​ సాగర్​ రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. దీపక్​ కుటుంబం బిహార్​ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. కొద్ది రోజుల క్రితం దీపక్​ భార్య బిహార్​కు వెళ్లింది. సోమవారం అర్ధరాత్రి.. నలుగురు దుండగులు దీపక్​ ఇంట్లో చొరబడి ఆయుధాలతో అతడిని చంపేశారు. ఇదంతా దీపక్​ కుమార్తెల కళ్ల ముందే జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులెవరు?

ఏడాదిన్నర కాలంగా.. దీపక్​ తన కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు తల్లికి వివరించారు. ఈ వ్యవహారంపైనే దంపతులు తరచూ గొడవపడుతూ ఉండేవారు. హత్య జరిగిన రోజు రాత్రి కూడా.. దీపక్​ తాగేసి వచ్చి కుమార్తెలను చిత్రహింసలు పెట్టాడు.

కొద్ది రోజుల క్రితం తండ్రి గురించి తోటి కాలేజీ మిత్రులతో పిల్లలు పలు విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. హత్య వెనుక వారి మిత్రులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై యెలహంక న్యూటౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన డీసీపీ సీకే బాబా.. 'హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. విచారణ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నిందితుల గురించి సమాచారం అందింది. అతి త్వరలోనే అరెస్టు చేస్తాం' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.