ETV Bharat / bharat

పరువు హత్య కలకలం.. పెళ్లి కాకుండానే శిశువుకు జన్మనిచ్చిందని..

author img

By

Published : Dec 17, 2022, 12:07 PM IST

వివాహానికి ముందే శిశువుకు జన్మనిచ్చిన ఓ యువతిని విషం పెట్టి చంపారు ఆమె తండ్రి, అత్త. ఈ అమానవీయ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు, రెండు మూగజీవాలను తగలబెట్టాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది.

murder
హత్య

తమిళనాడు తిరుచ్చిలో దారుణం జరిగింది. వివాహానికి ముందే గర్భం దాల్చినందుకు కుమార్తెను హత్య చేశారు ఆమె తండ్రి, అత్త. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముక్కోంబు ప్రాంతంలోని రామావతలై కాలువ ఒడ్డున డిసెంబరు 5న అప్పుడే పుట్టిన మగశిశువును ఎవరో బహిరంగ ప్రాంతంలో వదిలేసినట్లు స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో ఎలమనూర్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థిని (19) ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థిని విష ప్రభావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చడం వల్ల బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడైంది. ఈ విషయం తెలియడం వల్ల ఆమె తండ్రి సెల్వమణి, మేనత్త మల్లికతో కలిసి ఆ బాలికతో బలవంతంగా పురుగుల ముందు తాగించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మూగజీవాలపై దారుణం..
మధ్యప్రదేశ్ భోపాల్​లో అమానవీయ ఘటన జరిగింది. మూగజీవాల పట్ల దారుణంగా వ్యవహరించాడు గుర్తు తెలియని వ్యక్తి. రెండు కుక్కలను సజీవ దహనం చేశాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికుల ఫిర్యాదుతో ఎంపీ నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ప్రార్థన చేస్తుండగా కుప్పకూలిన విద్యార్థి..
ఐటీఐ కాలేజీలో ప్రార్థన చేస్తుండగా ఓ విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఒడిశాలోని ఢెంకానాల్​లో జరిగింది. మృతుడి పేరు అభిజీత్ దాస్​ అని.. అతడు ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడని కళాశాల యాజమాన్యం తెలిపింది. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.