ETV Bharat / bharat

మరో ఫ్యాట్ సర్జరీ విఫలం.. బాధితురాలు ఏడుస్తూ వీడియో పోస్ట్

author img

By

Published : Jun 1, 2022, 7:53 PM IST

Fat Surgery fail Karnataka: కర్ణాటకలో ఫ్యాట్ సర్జరీ వికటించిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. సర్జరీ విఫలమై ఇటీవలే ఓ టీవీ నటి మరణించగా.. తాజాగా ఓ మహిళకు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయి.

fat-surgery-fail-in-karnataka
fat-surgery-fail-in-karnataka

Karnataka failed Fat Surgery: ఫ్యాట్ సర్జరీ వికటించి టీవీ నటి ప్రాణాలు పోయిన ఘటన మరువక ముందే ఇలాంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్​గా పనిచేస్తున్న మహిళ.. ఇటీవల ఫ్యాట్ సర్జరీ చేయించుకోగా.. అది వికటించింది.
Woman fat surgery failed: దిల్లీకి చెందిన బాధితురాలు బెంగళూరు ఎంఎస్ పాల్య ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంది. పది రోజుల తర్వాత ఆమెకు సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి. శస్త్రచికిత్స జరిగిన పొత్తికడుపు వద్ద గాయాలు నల్లగా మారిపోవడం, అక్కడ చీము నిండిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. నొప్పి తీవ్రమవుతోందని బాధితురాలు కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియో అప్​లోడ్ చేసింది. సర్జరీ చేసిన ఆస్పత్రి తనకు సహకరించడం లేదని వాపోయింది. చీమును తొలగించేందుకు మళ్లీ శస్త్రచికిత్స నిర్వహించాలని వైద్యులు చెబుతున్నారని తెలిపింది. దీంతో బాధితురాలికి భయం పట్టుకుంది. తనకు ఈ పరిస్థితి కల్పించిన వైద్యులపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది.

fat-surgery-fail-in-karnataka
చీము నిండిన భాగాన్ని చూపిస్తున్న మహిళ
fat-surgery-fail-in-karnataka
ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన బాధితురాలు

ఇటీవలే కర్ణాటకకు చెందిన టీవీ నటి చేతనా రాజ్ సైతం ఫ్యాట్ సర్జరీకి బలయ్యారు. 21 ఏళ్లకే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మే 16న ఆమె బెంగళూరులోని ఓ కాస్మోటిక్​ ఆస్పత్రిలో ఫ్యాట్ ఫ్రీ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్​ అయిన కొన్ని గంటలకు ఆమె ఊపిరితిత్తుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పరిస్థితి వికటించి.. మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్త పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: గోవా టూర్​ వెళ్లిన కుర్రాళ్లకు బిగ్ షాక్.. హింసించి, అర్ధనగ్న వీడియోలు తీసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.