Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్​-రే' లాంటిది: రాహుల్​ గాంధీ

author img

By PTI

Published : Oct 10, 2023, 3:50 PM IST

Caste Census Is Like X Ray Said Rahul Gandhi

Caste Census Congress : కుల గణన.. దేశానికి సంబంధించి ఒక 'ఎక్స్​-రే' వంటిదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టడానికి కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము సమాయత్తం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Caste Census Congress : కుల గణన ప్రక్రియను.. దేశానికి సంబంధించి ఒక 'ఎక్స్​-రే'గా అభివర్ణించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దీని ద్వారా దేశంలోని ఓబీసీలు, దళితులు, గిరిజనులు సహా ఇతర వర్గాల సమగ్ర సమాచారం తెలుసుకుని, వారి స్థితిగతులను పూర్తిగా అర్థం చేసుకోవచ్చని ఆయన​ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము కసరత్తు చేస్తున్నట్లు రాహుల్​ పేర్కొన్నారు. కుల గణన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసిన మరుసటి రోజు మధ్యప్రదేశ్​లోని షాడోల్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశంలోని ఓబీసీలు, దళితులు, గిరిజనుల స్థితిగతుల గురించి వాస్తవాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే కుల గణన ప్రక్రియను త్వరితగతిన నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి తెస్తాము. ఈ విషయంలో రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లోని మా ప్రభుత్వాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. కుల గణన చేయడం అనేది దేశానికి ఒక ఎక్స్​-రే. దీని ద్వారానే దేశంలోని బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తాయి."

- రాహుల్ గాంధీ, ఎంపీ

"కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన కుల గణన సమాచారాన్ని బయటపెట్టాలని మేము ప్రధాన మంత్రికి సవాలు విసిరాము. కానీ ఆయన దాని గురించి మాట్లాడరు. దీనికి బదులుగా పాకిస్థాన్​, ఆఫ్గానిస్థాన్​ సహా ఇతర దేశాల గురించి ప్రస్తావిస్తారు. ముందు ఎంతో ముఖ్యమైన కుల గణన అంశంపై నోరు విప్పండి' అని మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ.

  • जातिगत जनगणना राजनीतिक फैसला नहीं, न्याय और हिस्सेदारी का फैसला है - गरीबों को शक्ति देने वाला फैसला है। pic.twitter.com/qOVdKpTJVj

    — Rahul Gandhi (@RahulGandhi) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మధ్యప్రదేశ్​ బీజేపీ స్కామ్​లకు నిలయం..'
బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ప్రయోగశాల గుజరాత్ కాదని.. మధ్యప్రదేశ్ అని భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత ఎల్‌కే అడ్వాణీ రాసిన పుస్తకంలో రాసి ఉందని రాహుల్​ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్​ బీజేపీ చేసిన అనేక స్కామ్​లకు నిలయం అని​ ఎద్దేవా చేశారు. ఇందులో వ్యాపం కుంభకోణం నుంచి, వైద్యం, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో గిరిజనలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తోందని రాహుల్​ మండిపడ్డారు.
మధ్యప్రదేశ్​లో వచ్చేనెల 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

Mr Tamilnadu Death : గుండెపోటుతో 'మిస్టర్ తమిళనాడు' మృతి.. జిమ్​లో ట్రైనింగ్​ ఇచ్చి..

Retired Commander Inder Singh Died : పాకిస్థాన్​ 'గాజీ'ని ముంచిన కమాండర్​ కన్నుమూత.. 1971 యుద్ధం గెలుపులో కీలక పాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.