ETV Bharat / bharat

నదిలో 53కేజీల వెండి శివలింగం.. గ్రామస్థుల పూజలు.. పోలీస్ స్టేషన్​లో దర్శనాలు!

author img

By

Published : Jul 17, 2022, 4:05 PM IST

53-kg-silver-shivling-found-on-banks-of-ghaghra-river-in-mau
53-kg-silver-shivling-found-on-banks-of-ghaghra-river-in-mau

సాధారణంగా అప్పుడప్పుడు నదుల్లో స్నానం చేస్తున్న సమయంలో వస్తువులు దొరుకుతుంటాయి. అయితే అదే రీతిలో ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాగ్రా నదిలో బిందెను శుభ్రం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి భారీ వెండి శివలింగం లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు శివలింగాన్ని చూడడానికి ఎగబడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ShivLing In River: ఉత్తర్‌ప్రదేశ్‌.. మౌ జిల్లాలోని ఘాగ్రా నదిలో భారీ వెండి శివలింగం లభ్యమైంది. దోహ్రిఘాట్‌ గ్రామంలో బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న ఓ వ్యక్తి చేతికి ఏదో తగిలినట్లు అనిపించి.. మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో తవ్వగా 53 కేజీల భారీ శివలింగం బయటపడింది. ఆ శివలింగాన్ని చూడడానికి గ్రామస్థులు ఎగపడడం వల్ల.. పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు.

53-kg-silver-shivling-found-on-banks-of-ghaghra-river-in-mau
శివలింగానికి గ్రామస్థుల పూజలు
53-kg-silver-shivling-found-on-banks-of-ghaghra-river-in-mau
పోలీస్​స్టేషన్​లో భారీ వెండి శివలింగం

ఇదీ జరిగింది.. దోహ్రిఘాట్​ గ్రామానికి చెందిన రామ్​మిలాన్​​ అనే వ్యక్తి.. నిత్యం ఘాగ్రా నదిలో స్నానమాచరిస్తుంటాడు. అయితే ఆదివారం ఉదయం స్నానం చేశాక.. తాను తెచ్చిన పూజకు సంబంధించిన నీటి బిందెను శుభ్రం చేద్దామని కొంచెం మట్టిని తీశాడు. అప్పుడు అతడి చేతికి ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే చేతితో మట్టిని తవ్వడం ప్రారంభించాడు. అతడికి సమీపంలో చేపలు పడుతున్న ఇద్దరు జాలరులను కూడా సాయానికి పిలిచాడు. ముగ్గురు కలిసి తవ్వగా అక్కడ ఉన్న భారీ వెండి శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి బయటకు తీశారు.

53-kg-silver-shivling-found-on-banks-of-ghaghra-river-in-mau
వెండి శివలింగం

ఆ తర్వాత రామ్​మిలాన్​ కుమార్తె తన తలపై వెండి శివలింగాన్ని పెట్టుకుని వారి గ్రామంలో ఉన్న పురాతన శివాలయానికి తీసుకెళ్లింది. అక్కడ ఆ శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు రామ్​మిలాన్​ కుటుంబసభ్యులు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా శివలింగాన్ని చూడడానికి ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. శివలింగాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్​స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, శివలింగాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు కూడా వెండి శివలింగాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఇదీ చదవండి: అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.