LIVE : తిరుమల బ్రహ్మోత్సవాలు - మహారథంపై శ్రీవారు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video

Published : September 22, 2026 at 7:29 AM IST
Tirumala Brahmotsavam 2026 Live : అంగరంగ వైభవంగా సాగుతున్న తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. గడిచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేసిన స్వామివారు ఎనిమిదో రోజు ఇవాళ ఉదయం ప్రాతఃకాల సమయాన మహారథం అధిష్టించారు. ధారు రథంపై శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు దర్శనమిచ్చారు. రథంపై విహరించే శ్రీవిష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదన్నది పురాణోక్తి. బ్రహ్మోత్సవాల వేళ మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమలగిరులు మారుమోగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.