ETV Bharat / state

'కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసిబిడ్డే' - లోకేశ్​కు భువనేశ్వరి బర్త్​డే విషెష్​

నారా లోకేశ్​కు మంత్రుల నుంచి శుభాకాంక్షల వెల్లువ - విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తెస్తున్నారన్న ఉపముఖ్యమంత్రి - రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు లోకేశ్​ నిరంతరం కృషి చేస్తున్నారన్న మంత్రులు

Nara Bhuvaneshwari, Brahmani and Ministers Wishes to Lokesh
Nara Bhuvaneshwari, Brahmani and Ministers Wishes to Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 23, 2026 at 4:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nara Bhuvaneshwari, Brahmani and Ministers Wishes to Lokesh: మంత్రి నారా లోకేశ్​ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యం నారా భువనేశ్వరి లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు. కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసిబిడ్డగానే కనిపిస్తాడని, లోకేశ్​ను చూస్తున్నప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు తన చేతుల్లో ఆడుకున్న పిల్లాడేనా అనిపిస్తుందని భువనేశ్వరి అన్నారు.

ఇప్పుడు మంత్రిగా బాగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా మరెన్నో పుట్టిన రోజులను జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నానన్నారు. లోకేశ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిరంతరం మార్పు తీసుకురావాలని, నిబద్ధతతో పని చేయడం అందరికీ స్ఫూర్తినిస్తుందని లోకేశ్​ సతీమణిి నారా బ్రహ్మణి ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

శుభాకాంక్షల వెల్లువ: ఉపముఖ్యమంత్రి పవన్‌ లోకేశ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తెస్తున్నారన్నారు. టీచర్స్‌, పేరెంట్స్‌ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తున్నారని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో లోకేశ్​ ముందడుగు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు లోకేశ్​కు మరింత శక్తి అందించాలని పవన్‌ అన్నారు.

మంత్రులు అచ్చెన్న, అనిత, సంధ్యారాణి, సుభాష్, రామానాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, అనగాని, స్వామి, నారాయణ, కేశవ్, మండిపల్లి, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లోకేశ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేశ్​ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రుల కితాబిచ్చారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు లోకేశ్​ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడార.

మెగా రక్తదాన శిబిరం: లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రాయచోటిలో మెగా రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసే నిరంతర కృషీవలుడు లోకేశ్​ అని అన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, ప్రజల ఆశీర్వాదంతో మరింత ఉన్నత విజయ శిఖరాలను అధిరోహించాలని మంత్రి మండిపల్లి అన్నారు.

పెద్ద ఎత్తున సంబరాలు: విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్​ జన్మదినం సందర్భంగా, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పెట్టుబడులు రాబట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న లోకేశ్​ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆకాంక్షించారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఏపీ మాంసం అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు పేదలకు అన్నదానం చేశారు.

మంత్రి లోకేశ్​ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మంత్రి సంధ్యారాణి వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లోకేశ్​ జన్మదినం సందర్భంగా రాజాంలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ బాధ్యుడు ముక్కారూపానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఆహారం పంపిణీ: రైల్వే కోడూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సాంస్కృత విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ ఆధ్వర్యంలో 50 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్న క్యాంటీన్‌లో ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు, దుప్పట్లు అందజేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోనూ లోకేశ్​ జన్మదిన వేడుకలు జరిపారు. బోరంగిలోని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యాలయం ఎదుట 'హ్యాపీ బర్త్‌డే లోకేశ్​ అన్న- టీం బోడె' అనే స్లోగన్​తో మానవహారం ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ నా ప్రధాన బాధ్యత: మంత్రి లోకేశ్​

విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ నెలకొల్పండి - నిఖిల్ కామత్​కు లోకేశ్​ విజ్ఞప్తి