ETV Bharat / spiritual

దేవతల చేతుల్లో "త్రిశూలం" ఎందుకు? - ఇది దేనికి సంకేతం?

వివిధ దేవతామూర్తుల చేతుల్లో ఆయుధంగా 'త్రిశూలం' - అలా ఉండడం వెనుక ఉన్న రహస్యం ఇదే!

Trishul Significance
Trishul Significance (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 30, 2026 at 2:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trishul Significance in Telugu : దేవతామూర్తులను మనం చూసినట్లయితే వారి చేతుల్లో వివిధ ఆయుధాలు కనిపిస్తుంటాయి. అందులో పరమశివుడు, దుర్గామాత, కాళికాదేవి చేతుల్లో త్రిశూలం ఆయుధంగా గోచరం అవుతుంది. ఇది దేనికి సంకేతం? కుమారస్వామిని త్రిశూలానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? దీనిపై ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణమూర్తి పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సృష్టి, స్థితి, లయాలకు, ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులకు, భూత, భవిష్యత్, వర్తమానాలకు ఈ "త్రిశూలం" ప్రతీక అని చెబుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సూర్యనారాయణమూర్తి. ఇంతకంటే మించి ఇంకొక ప్రతీకాత్మక వివేచన కూడా ఉంది. అదేంటంటే, మనసు, బుద్ధి, చిత్తం, అంతఃకరణమ అనే మూడింటిని మధ్యగా కాయిక, వాచికములు ఇరువైపులుగా త్రిశూలంగా ఆలోచన చేసే విధానం. కాయికం అంటే శరీరం, వాచికము అంటే మనసు మాట. మధ్యలో ఉండే "బుద్ధి" ఇందులో మనసు, బుద్ధి, చిత్తం, అంతఃకరణమ ఉన్న కారణం చేత కాస్త ఎగువగా కనిపించే ప్రయత్నం విశేషంగా మధ్యలో. ఈ మూడింటిని కలిపి 'త్రిశూలం' అంటున్నాం.

ఒకానొక రాక్షసుడిని సంహారం చేయడం కోసం వాడు త్రిపురములపైన ఆధారం గల శక్తి. ఈ త్రిపురములు కూడా బంగారం, వెండి, లోహాలతో చేసిన నగరాలు. మూడు నగరములు నిర్మించుకొని భూమికి సంబంధించిన కక్ష్య అవతల అంటే శూన్యంలో నివాసం ఉంటున్నాడు. శూన్యంలో త్రిపురాసరుడిగా నివాసం చేస్తున్న కారణంగా మరణం లేకుండా పోయింది. రాక్షస స్వభావం కారణం చేత ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. మాట, మనసు, శరీరం ఈ మూడు కూడా త్రికరణములు. ఇవి ఒకే మాట మీదికి రావాలి. అప్పుడే త్రిశూలం సమర్థవంతంగా శత్రు నాశనం చేయగలుగుతుందంటున్నారు ఆధ్యాత్మిక వేత్త సూర్యనారాయణమూర్తి.

మార్కండేయ పురాణంలో అంతర్గతమైన సప్తశతి ఈ విశేషాంశాన్ని "ఎందుకు త్రిశూలం" అని చెబుతూ ఈ విషయాన్ని మరింత ప్రత్యేకంగా వివరిస్తుంది. అందుకే, కేవలం శివ సంబంధమైన కుటుంబ వృత్తాంతాలలోనే కాకుండా ఏ దేవతకు సంబంధించిన విశేష రూపమైన కూడా, చతర్భుజ, షోడశభుజ, అష్ట భుజాదులతో ఆ దైవాన్ని మనం దర్శించే క్రమంలో ఉంటే చేతిలో మనకు త్రిశూలం కూడా కనిపిస్తుందంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో త్రిశూలం అంటే మనలో ఉన్నటువంటి గత, వర్తమాన, భవిష్యత్ జన్మల వృత్తాంతాలు, చేసే కర్మలలో ఉన్నటువంటి సత్వ రజస్తమోగుణాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాదులతో పాటుగా మనలో ఉన్నటువంటి తామసికాదులతో పాటుగా అనేకం చేసినవి, చేయబోయేవి, చేస్తున్నవి అన్నింటికీ మూలంగా ఉండే మనసు ప్రధానంగా ఈ శూలాన్ని మనకు మనమే నిర్మించుకోవాలి. తీవ్రమైన దోషం చేసినవారికి శూల దండన అంటూ మనకు మహాభారతం వివరిస్తుంది. భాగవతం కూడా ద్వితీయ స్కంధంలో ఇరవై ఎనిమిది రకములుగా ఉండే నరకములలో 'శూల దండన' ఒక నరకం అంటూ తెలియజేస్తుంది.

గుడి చుట్టూ "ప్రదక్షిణలు" ఎందుకు చేయాలి? - ఎలా చేస్తే మంచిది?

శూల దండన అంటే ఏమిటంటే?

శూలం మీద కూర్చుని తపస్సు చేయడం. శూలాన్ని దేహంలో ఒక బాధాకరంగా దిగవేసుకుని శివనామ స్మరణ చేయడం. తీవ్రమైన ఈ శివ సంబంధిత లీలలు, విన్యాసాలన్ని కూడా మనం వీరపాశుపతం లేక పాశుపత విధానంలో చూస్తూ ఉంటాం. శూలం అన్నప్పుడు మనలో సత్వ గుణాన్ని పెంచేదిగా కూడా మనం భావన చేయాలంటున్నారు ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణమూర్తి. ఇదంతా ఒక వర్గం కాగా, శూలానికి సంబంధించి ఇంకొక జ్ఞానం ఉంది.

పంచాయతన ఆలయంలో ఆరోవ దైవం కుమారస్వామి. ఈయనకు ప్రతీక త్రిశూలం. ఈశ్వరుడు మధ్యలో, వినాయకుడు నైరుతి, పార్వతీదేవి వాయవ్యం, విష్ణువు ఈశాన్యం, సూర్యుడు ఆగ్నేయం కాగా ఆరోవ శక్తిగా ఆలయంలో ఉండే శక్తిస్వరూపము కుమారస్వామి త్రిశూలానికి ప్రతీక. శక్తి కుమారస్వామికి తనకు ప్రాతినిధ్యం వహించే విధంగా శూలాన్ని అందించింది. దానితో ఆ కుమారస్వామి శక్తిధరుడు, శూలధరుడు అయ్యాడు. శివ కుటుంబమే కాకుండా ఏ దైవానికి కూడా మనం చూసినప్పుడు ఈ శూలాన్ని త్రిశూలాన్ని ఎలా చూస్తామో శక్తికి ప్రతీక త్రిశూలం ఇది ప్రధానమని వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణమూర్తి.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"జాబ్‌ చేస్తా, పెళ్లి మాత్రం వద్దు" - ప్రముఖ జ్యోతిషులు ఏమంటున్నారంటే!

బద్రీనాథ్‌లో నారాయణుడిని లక్ష్మీదేవి ఎలా రక్షించింది? ఆరు నెలల పాటు వెలిగే అఖండ దీప రహస్యమిదే!