ETV Bharat / snippets

కల్తీసారా బాధితులు కేర్​ లెస్​- లిమిట్​కు మించి తాగడం వల్లే!: కమల్ హాసన్​

Kamal Haasan On Hooch Tragedy
Kamal Haasan On Hooch Tragedy (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 6:55 PM IST

Kamal Haasan On Hooch Tragedy : తమిళనాడు కల్తీసారా ఘటన బాధితులు అజాగ్రత్తగా ప్రపర్తించారని నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. పరిమితిని మించిపోయారని అన్నారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తగినంత మద్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఫార్మసీ స్టోర్ల కన్నా TASMAC మద్యం రిటైల్ అవుట్‌లెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

"కల్తీసారా ఘటన బాధితుల పట్ల నాకు సానుభూతి లేదని నేను చెప్పను. కానీ వారంతా తమ పరిమితిని మించిపోయారని అర్థం చేసుకోవాలి. చాలా అజాగ్రత్తగా ప్రవర్తించారు. ఎవరైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన అలవాటు అనేది అకేషనల్(ఎప్పుడో ఒకసారి)గా ఉండాలి. చక్కెర గానీ ఏ పదార్థం గానీ అతిగా తీసుకుంటే హాని కలిగిస్తుందని అంతా అర్థం చేసుకోవాలి" అని కమల్ హాసన్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.