ఎన్నికల వేళ హడావుడిగా టిడ్కో ఇళ్ల పంపిణీ - మౌలిక వసతులు లేవంటూ లబ్ధిదారులు ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 8:56 PM IST

thumbnail

YSRCP Leaders Tidco Houses Distribution Program in Bobbili : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార నేతలు హడావుడిగా టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి కసరత్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని రామన్నదొర వలస వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే తప్ప ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రహదారులు, డ్రైన్లు, విద్యుత్తు, తాగునీరు వంటి సౌకర్యాలు లేకుండా నాయకులు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ పార్టీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం అయిదేళ్లు అవుతున్నా మాకెందుకు అప్పగించడం లేదని మరికొంత మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్​ వాయిదాలు కట్టమని ప్రతి నెల అధికారులు వేధిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నామని వాపోయారు. ఈ క్రమంలోనే పురపాలక సంఘం అధ్యక్షులు సావు వెంకట మురళీకృష్ణ, కమిషనర్​ రామలక్ష్మిలను నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో అప్పగిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.