కుప్పం ప్రజలను మోసం చేసిన జగన్​కు ఓట్లు అడిగే హక్కు లేదు: దేవినేని ఉమా - Devineni Uma Comments on YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 9:34 AM IST

thumbnail

TDP Leader Devineni Uma Fires on YCP Government : కుప్పం ప్రాంతానికి నీళ్లు అందిస్తున్నానంటూ సినిమా సెట్టింగ్‌ వేసి డ్యాం కట్టి సీఎం జగన్‌ చేసిన హడావుడికి ప్రజలు ఫక్కున నవ్వారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఐదు సంవత్సరాలుగా సాగునీటి సమస్యను పట్టించుకోని జగన్‌కు ఆ ప్రాంతీయ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. అర్చకులపై దాడి, బెదిరింపులు చేయడం రాక్షసత్వమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలో అర్చకులు, బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

ఎన్ని లక్షల మంది ప్రజలకు సీఎం జగన్​ త్రాగునీరు ఇచ్చారో చెప్పాలి.హెలికాప్టర్​ యాత్రలు అయిపోయాయి. ఇప్పుడు బస్సు యాత్రలు మొదలుపెట్టారు. కుప్పం ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేద్దామనుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి రూ.460 కోట్లకు పైగా చంద్రబాబు పనులు పూర్తి చేస్తే మీరు రూ.40 కోట్ల పనులు చేయలేకపోయారంటే కుప్పం ప్రజల మీద జగన్​కు ఎంత కక్ష ఉందో అర్థమవుతోంది. జగన్​కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూ దేవాలయాలు, అర్చకులపై దాడులు చేస్తున్నారు. - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.