అధికారుల ఒత్తిడి తట్టుకోలేక రేషన్‌ పంపిణీ వాహన చోదకుడు ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 12:29 PM IST

thumbnail

Ration Distribution Vehicle Driver Suicide Due to Pressure of Authorities : రేషన్​ పంపిణీలో జాప్యం జరగడంతో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఎండీయూ వాహన చోదకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని కురుపాం మండలం గుమ్మగదబవలసలో నివాసముంటున్న సీమల నూకయ్య నాలుగేళ్లుగా రేషన్​ పంపిణీ వాహనాన్ని నడుపుతున్నాడు. గత నెలలో సీడీమానుగూడలో 30 మందికి రేషన్‌ పంపిణీ సరఫరా చేయలేదు. దీనిపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. లబ్దిదారులకు ఇవ్వాల్సిన బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేయాలని, లేకపోతే రూ.30వేలు కట్టాలని విక్రయదారుడు ఒత్తిడి చేశారు.

దీంతో బియ్యం కొనుగోలు చేసి అందరికీ పంపిణీ చేశాడు. అయినప్పటికీ కురుపాం తహసీల్దారుకు గ్రామస్థలు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురై నూకయ్య సోమవారం మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డిపో సేల్స్​మెన్​, రెవెన్యూ అధికారుల ఒత్తిడే కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.