శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 5:47 PM IST

thumbnail

National Dam Safety Authority To Inspect Srisailam project : శ్రీశైలం డ్యామ్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు (గురువారం) పరిశీలించింది. గత నెల జనవరి 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రలతో సమావేశమై తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టంది. తనిఖీల్లో భాగంగా జాతీయ విపత్తు సంస్థ సభ్యుడు వివేక్ త్రిపాఠి ఆధ్వర్యంలో కృష్ణ రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు సభ్యులు, కేంద్ర జల వనరుల కమిషన్​కు సంబంధించిన అధికారులు శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకున్నారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ, స్థితిగతులు, 2009 వరదల తరువాత డ్యాం పరిసరాల భౌతిక మార్పులపై అధికారుల బృందం ఆరా తీసింది. 

నిపుణుల బృందం అడిగిన ప్రశ్నలకు, ప్రాజెక్టు ముఖ్య ఇంజనీరు కబీర్ భాష, పర్యవేక్షణ ఇంజనీరు శ్రీరామచంద్రమూర్తి సమాధానాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీశైలం డ్యాంకు సంబంధించిన పలు మ్యాపులు, గణాంకాలను డ్యాం సేఫ్టీ బృందానికి సమర్పించారు. నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలన చేసి, నివేదిక రూపొందించిన తరువాత జలాశయం భద్రతపై తగిన చర్యలు తీసుకుంటుందని ప్రాజెక్టు ముఖ్య ఇంజనీర్ కబీర్ భాష తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.