వాడివేడిగా మున్సిపల్​ కౌన్సిల్​ సమావేశం- అక్రమ లేఅవుట్లపై ఇరుపార్టీల నేతలు ఆరోపణలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 5:01 PM IST

thumbnail

Municipal Council Meeting in Jaggaiyapet : కాకినాడ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపల్​ కౌన్సిల్​ సమావేశం వాడి వేడిగా జరిగింది. స్థానిక అక్రమ లేఅవుట్లపై టీడీపీ, వైసీపీ కౌన్సిల్​ సభ్యులు ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసున్నారు. మున్సిపల్​ ఛైర్మన్​ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన కౌన్సిల్​ సమావేశంలో ఇరుపక్షాల సభ్యులు పట్టణంలో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ లేఅవుట్ల గురించి చర్చించారు. దీని వల్ల పట్టణంలోని ప్రజలు నష్టపోతున్నారని ఛైర్మన్​కు తెలియజేశారు.

పురపాలక సంఘానికి రావాల్సిన స్థలాలను ఇవ్వకుండా, ప్రజలకు వసతులు కల్పించకుండా వారిని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్ల అధికార పార్టీ వారిపై ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి కేవలం కాగితాలపై మ్యాపులు వేసి స్థలాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇంజనీరింగ్​ శాఖ పనుల నిర్మాణాల్లో చేస్తున్న అధికారుల అలసత్వంపై విపక్షాల సభ్యులు ధ్వజమెత్తారు. అక్రమ లేవుట్లకు ఏ పార్టీ సభ్యులైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలని ఇరుపార్టీల సభ్యులు సృష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.