వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం- రైతులను ఆదుకుంటాం: శ్రీకృష్ణదేవరాయలు - Lavukrishna Devarayalu Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 5:22 PM IST

thumbnail
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం- రైతులను ఆదుకుంటాం: శ్రీకృష్ణదేవరాయలు (ETV Bharat)

Lavu Srikrishna Devarayalu Interview in palnadu District : పల్నాడు జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ప్రజలకు సుపరిపాలనను తీసుకొస్తామని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవటంతో పాటు పల్నాడులో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీర్చేలా కృషి చేస్తామని లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలు ఎక్కువ గొడవలు చెయ్యరు ఎందుకంటే అధికారం పోతుందని తెలిసి వాళ్లు ఏ కేసుల్లో ఇరుక్కోవ్వాలనుకోరని తన అభిప్రాయం చెప్పారు.

వైఎస్సార్సీపీ నేతల్లా మోసపు మాటలు చెప్పటం, బూతులు మాట్లాడటం తనకు రాదని అంతా చేతల్లోనే చూపిస్తానంటg గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారంటున్న లావు శ్రీ కృష్ణదేవరాయలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.