విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్‌ విడుదల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 9:29 PM IST

thumbnail

Kodi Kathi Srinu Released From Vizag Central Jail : కోడి కత్తి కేసులో దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనివాస్‌కు బెయిల్‌ లభించడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. కోడికత్తి శ్రీనివాస్‌కు ఎస్సీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. జై భీమ్‌ అంటూ నినాదాలు చేశారు. నిన్న శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. తమకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన తరపు న్యాయవాది సలీం అన్నారు. 

అయితే కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టు నిన్న (గురువారం) బెయిల్‌ మంజూరు చేసింది. విడుదలయ్యాక కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఈ సందర్భంగా శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది. 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేయగా నాటి నుంచి జైలులోనే మగ్గుతున్నాడు. ఇన్నాళ్లూ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్న శ్రీనివాస్​కు గురువారం బెయిల్​ మంజూరైంది. రూ.25 వేలు పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, మీడియాతో మాట్లాడొద్దని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.