LIVE: గవర్నర్​ను కలిసిన కోడి కత్తి శ్రీను తల్లి, సోదరుడు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 5:36 PM IST

Updated : Feb 2, 2024, 6:03 PM IST

thumbnail

Kodi Kathi Srinu Family Meet Governor: రాష్ట్రంలో దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులపై నివేదిక సమర్పించటానికి రాష్ట్ర గవర్నర్​ను సమతా సైనిక్ దళ్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కలిశాయి. వీరితో పాటు కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘాల నేతలు సైతం వెళ్లారు. గవర్నర్​ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు.

కాగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కొద్ది రోజుల క్రితం నిరహార దీక్ష చేపట్టారు. అదే విధంగా కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ శ్రీనివాస్​ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం శీను తల్లి సావిత్రమ్మ సైతం నిరాహార దీక్షం చేశారు. కోడి కత్తి శ్రీనివాస్​ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. కోడి కతి శ్రీనుకు ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. దళితుడైన శ్రీను నిందితుడిగా అయిదేళ్ల పాటు జైల్లో మగ్గుతున్నాడని మండిపడుతున్నారు. 

కోడికత్తి శ్రీను కేసు పరిస్థితిని వివరించేందుకు నేడు గవర్నర్​కు సమతా సైనిక్ దళ్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 

Last Updated : Feb 2, 2024, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.