అధికారుల అండతో ఇసుక దోపిడీ- కనుమరుగవుతున్న భూములు - Illegal Sand Mining in Konaseema

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 5:51 PM IST

thumbnail

Illegal Sand Mining in Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక కొమరగిరి గ్రామాల సరిహద్దుల్లో జై భీమ్ సొసైటీ లంక భూములలో ఇసుక మేటలను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియా బరితెగింపుపై గత నాలుగు రోజులుగా రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని సొసైటీ లంక భూముల హక్కు దారులైన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే ప్రాంతంలో గోతులు పూడ్చడానికీ, రహదారి నిర్మాణానికి అవసరం నిమిత్తం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల మేరకే అంటూ వందలాది లారీల ఇసుకను పక్కదారి పట్టిస్తున్న కాంట్రాక్టర్​పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ప్రాంతాల్లో తీసిన ఫోటోలు ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో డీఆర్​ఓకు వినతి పత్రం సమర్పించామని సర్పంచ్ విజయ చాముండేశ్వరి, సొసైటీ సభ్యులు తెలిపారు. కింది స్థాయి అధికారుల అండదండలతో ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాల వల్ల సొసైటీ లంక భూములు కనుమరుగై ఏటిగట్లకు గండ్లు పడి తీవ్ర నష్టం వాటిల్లుతుందని దళితులు ఆవేదన చెందుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.