భూహక్కు చట్టంపై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలుకు మరో 2 వారాల సమయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:42 PM IST

thumbnail

High Court Hearing on AP Land Titling Act: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ హక్కు చట్టాన్ని (AP Land Titling Act) రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాలు గడువు ఇచ్చినా ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వై. బాలాజీ కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కౌంటర్ దాఖలుకు న్యాయస్థానం 2 వారాలు సమయం ఇచ్చింది. 

అయితే ఈలోగా ప్రభుత్వం యాక్ట్​ను అమలు చేసే అవకాశముందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. యాక్ట్ అమలు చేస్తే అత్యవసర పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్​కు అవకాశం ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. 

కాగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ గత కొన్నినెలలుగా న్యాయవాదులు కోరుతున్నారు. భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో తమ నిరసనను సైతం తెలిపారు. ప్రజల హక్కులను, ఆస్తులను హరించే విధంగా ఈ చట్టం ఉందని న్యాయవాదులు మండిపడుతున్నారు. భూ సమస్యలు పరిష్కరించే బాధ్యతలు రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.