నరసరావుపేటలో ఫ్లెక్సీల రగడ - ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ Vs ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 2:26 PM IST

thumbnail

Flexi War in Narasaraopeta : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇరు పార్టీల ఫ్లెక్సీల రగడ పట్టణ ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌  (MLA Anil Kumar Yadav)  భారీ ర్యాలీ చేయనున్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫ్లెక్సీలను ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు (MP Lavu Sri Krishnadevarayulu) కార్యాలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేశారు. అనిల్‌కుమార్‌ నూతన పార్లమెంట్ కార్యాలయాన్ని పల్నాడు రోడ్డులో ప్రధాన రహదారి ప్రక్కన ఏర్పాటు చేస్తున్నారు.

MLA Anil Kumar Yadav Vs MP Lavu Sri Krishnadevarayulu : ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరక ముందే నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి అంటూ నాయకులు ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. అయితే ఒకే దారిలో ఇరు పార్టీల ఫ్లెక్సీల ఏర్పాటును చూసి స్థానిక ప్రజలు విస్తుపోతున్నారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు ఎటు దారి తీస్తాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.