కేసీఆర్ సర్కార్ నిధులు, నియామకాలను విస్మరించింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 2:18 PM IST

thumbnail

MLC Jeevan Reddy Comments on KCR : కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం వల్ల కేసీఆర్ తెలంగాణ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. అంతకు ముందు కేసిఆర్ తెలంగాణ అంశాన్ని కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. గత పాలకులు నిధులు, నియామకాలను విస్మరించారని, తెలంగాణకు రావాల్సిన 512 టీఎంసీలు సీమాంధ్రకు పోయాయని పేర్కొన్నారు.

Jeevan Reddy Speech In Telangana Legislative Council 2024 : గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో సాగునీటి వినియోగంపై దృష్టి పెట్టకుండా, పర్యాటకంపై దృష్టి పెట్టిందని జీవన్ రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్​లు కేవలం కమీషన్ల కోసమే కట్టారని ఆరోపించారు. ఇంజినీర్లు ప్రభుత్వం ఏది చెబితే దానికి సంతకం పెట్టే పరిస్థితి నెలకొందని అన్నారు. అన్ని వసతులు ఉన్న రామగుండం కాదని, యాదాద్రిలో పవర్‌ ప్లాంట్‌ పెట్టారని విమర్శించారు. ఈ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.