వల్లూరులో ఉద్రిక్త వాతావరణం - జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అరెస్టు - Vegulla leela Krishna Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 4:20 PM IST

thumbnail
వల్లూరులో ఉద్రిక్త వాతావరణం - జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ అరెస్టు (ETV Bharat)

Clashes Between TDP And YCP Leaders : కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం రాత్రి తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మండపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలా కృష్ణను పోలీసుల అరెస్ట్‌ చేసి పామర్రు స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.  

 Janasena Leader Vegulla leela Krishna Arrest: విషయం తెలుసుకున్న మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి పరిశీలించారు. పోలీసులు లీలా కృష్ణపై కేసు నమోదు చేశారు. లీలా కృష్ణను ప్రత్యేక వాహనంలో ఆలమూరు కోర్టుకు పోలీసులు తరలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్​సీపీ నేతలు రాళ్లు, కర్రలతో ప్రతిపక్ష నేతలు, ఓటర్లపై దాడులకు తెగబడ్డారు. ఓటమి భయంతోనే  అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.