తిరుపతిలో 36 వేల దొంగ ఓట్లు - సీఈవోకు బీజేపీ ఫిర్యాదు - BJP Complain to CEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 9:53 PM IST

thumbnail

BJP Leaders Complain to CEO About Fake Fotes: తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసారు. అధికార వైసీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే కుట్ర చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 36 వేల దొంగ ఓట్లు ఉన్నట్టు ఈసీకి ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో అప్పటి రిటర్నింగ్ అధికారి గిరిషాను ఈసీ సస్పెండ్ చేసిందని గుర్తు చేసారు. కానీ ఆ దొంగ ఓట్లను మాత్రం జాబితా నుంచి తొలగించలేదని విమర్శించారు. వాటిని తక్షణం తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల చేసినా దాంట్లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. 

రిటర్నింగ్ అధికారి గిరిషా లాగిన్ ఉపయోగించి 36 వేల పైచిలుకు దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఈ ఆధారాలు సీఈఓకి సమర్పించామన్నారు. ఆ ఓట్లు తొలగించకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదనీ చెప్పామనన్నారు. దొంగ ఓట్ల కుంభకోణంలో అధికారుల పాత్ర 20 శాతమే రాజకీయ సూత్రదారుల పాత్ర 80 శాతం ఉందని మండిపడ్డారు. విచారణ తరవాత రాజకీయ నేతల పాత్రపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. దొంగ ఓట్ల కుంభకోణం లింక్​ ఉన్న రాజకీయ నేతలపై ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని కోరామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.