LIVE: వేంపల్లిలో షర్మిల, సునీత బహిరంగ సభ- ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 11:38 AM IST

Updated : Apr 12, 2024, 11:58 AM IST

thumbnail

APCC YS Sharmila Election Campaign Live: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు  షర్మిల ఎన్నికల ప్రచారం మూడు రోజుల తాత్కాలిక విరామం తర్వాత నేడు పులివెందులలో ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి ఆమె వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఉగాది, రంజాన్‌ పండగలు రావడంతో 9, 10, 11 తేదీల్లో విరామం ఇచ్చారు. తిరిగి ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10.30గంటలకు వేంపల్లె సభలో మాట్లాడి అక్కడ నుంచి వేముల మీదుగా పులివెందుల చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత లింగాల మీదుగా సింహాద్రిపురం చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30కి పులివెందుల చేరుకుని పూలఅంగళ్ల వద్ద సభలో ప్రసంగించనున్నారు.13న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆ రోజు 11.30కు యర్రగుంట్లలో సభలో మాట్లాడతారు. 12.25కు ముద్దనూరు మీదుగా జమ్మలమడుగు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. 6.30కు పాతబస్టాండు ప్రాంతంలో సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి  9.30కు ప్రొద్దుటూరు చేరుకుని వన్‌టౌన్‌ కూడలి, శివాలయం కూడళ్లలో నిర్వహించే సభలో మాట్లాడతారు. అక్కడ నుంచి నంద్యాల జిల్లాకు బయలుదేరి వెళతారని జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు పేర్కొన్నారు. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొన్నప్పటి నుంచి సునీత కూడా ఆమెకు తోడుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం వేంపల్లెలో వైఎస్‌ షర్మిల బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 12, 2024, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.