'వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్​తో ఫోటో దిగు - పెన్షన్ డబ్బులు పట్టు!'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 1:29 PM IST

thumbnail

Pension Money was Not Given to TDP Workers : సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో మైకు పట్టుకుంటే ఎప్పుడూ ఒకటే పాట ఎత్తుకుంటారు. అదే 'కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం' అంటూ గొంతుపోయేలా ప్రగల్భాలు పలుకుతుంటారు. దానికి తోడు అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా ప్రజల వద్దకే సేవ అనే నినాదంతో వాలంటీర్ వ్యవస్థకు రూపకల్పన చేసిన 'శిల్పి'ని అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు జగన్. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉంది. సంక్షేమ పథకాలు అందించడంతో వివక్షచూపుతున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. 

ఫొటో దిగండి - డబ్బులు పట్టండి : జనవరి నుంచి పెన్షన్ 3వేల రూపాయలకు పెరిగిన విషయంలో అందరికీ తెలిసిదే. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కౌన్సిలర్ శిరీష​తో ఫొటో దిగితేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని లేకుంటే ఇవ్వమని వాలంటీర్ తెలిపారని పెన్షన్ దారులు వాపోయారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల 42 వార్డుకు చెందిన లక్ష్మీదేవి, శ్రీనివాసులును వైఎస్సార్సీపీ నేతలతో ఫొటో దిగాలని వాలంటీర్ చెప్పాడని, దానికి తాము నిరాకరించడంతో రెండు నెలల పెన్షన్ నిలిపివేశారని ఆరోపించారు. తమ చేత తంబ్ వేయించుకున్న వాలంటీర్ డబ్బులు ఇవ్వలేదని పెర్కోన్నారు.

మూడు వేలు తీసుకుని వంద ఇవ్వండి : జనవరి నెలలో పెన్షన్ 3వేల రూపాయలకు పెరగ్గా అందులో నుంచి సంక్రాంతి సంబరాల లక్కీడిప్ టికెట్ పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు పెన్షన్ దారుల నుంచి 100 రూపాయలు దండుకుంటున్న విషయం విదితమే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.