ETV Bharat / technology

వాట్సాప్​లోనూ 'నియర్​బై షేర్​' - నెట్​వర్క్, కేబుల్స్​ లేకుండా ఫొటోస్​, వీడియోస్​ షేరింగ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 12:18 PM IST

upcoming features
WhatsApp nearby sharing Feature

WhatsApp Nearby Sharing Feature In Telugu : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​. వాట్సాప్​ తమ యూజర్ల కోసం, ఆండ్రాయిడ్​ ఫోన్లలో ఉంటే 'నియర్​బై షేర్' లాంటి ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్​ ఎనేబుల్ అయితే, వాట్సాప్ యూజర్లు తమ సమీపంలో ఉన్నవారికి చాలా సులువుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడానికి వీలవుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Nearby Sharing Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ త్వరలో 'నియర్​బై షేర్'​ ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇదే కనుక అందరికీ అందుబాటులోకి వస్తే, వాట్సాప్​ యూజర్లు తమ సమీపంలోని వ్యక్తులకు చాలా సేఫ్​గా ఫైల్స్, ఫొటోస్​, వీడియోస్​ పంపించడానికి వీలవుతుంది.

సురక్షితంగా షేరింగ్​
Upcoming WhatsApp Features : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే నియర్​బై షేర్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే, దగ్గర్లోని వ్యక్తులకు చాలా సులువుగా వీడియోస్​, ఫొటోస్, ఫైల్స్ పంపించడానికి వీలవుతోంది. యాపిల్​ ఫోన్లలో ఎయిర్​డ్రాప్​ ఫీచర్​ కూడా ఇలానే పని చేస్తుంది. ఇది యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అందుకే దీనిని తమ యూజర్లకు కూడా తీసుకువచ్చేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ నియర్​బై షేర్ ఫీచర్​ను వాట్సాప్ 2.24.2.17 బీటా వెర్షన్​లో టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్​ తెస్తున్న ఈ నియర్​బై షేరింగ్​లో ఎండ్​-టు-ఎండ్ ఎన్​క్రిప్షన్ ఉంటుంది. అంతేకాదు వాట్సాప్​లోని మీ ఫోన్​ నంబర్​ అవతలి వ్యక్తికి (కాంటాక్ట్ లిస్ట్​లో లేనివారికి) కనిపించదు. అందువల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.

పీపుల్ నియర్​బై
గతంలో చాలా మంది యూజర్లు ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్‌ కోసం 'షేర్‌ ఇట్‌' అనే యాప్‌ను ఉపయోగించేవారు. దానిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో గూగుల్‌ తమ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో 'నియర్‌బై షేర్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో ఒకేసారి చాలా మందికి ఫైల్స్‌ పంపవచ్చు. ముఖ్యంగా ఎలాంటి కేబుల్స్‌, నెట్‌వర్క్‌ అవసరం లేకుండా డివైజ్‌ టు డివైజ్‌ కనెక్టివిటీతో ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. ఈ తరహా ఫీచర్‌ను వాట్సాప్‌ 'పీపుల్‌ నియర్‌బై'గా పరిచయం చేయనుందని సమాచారం. ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి డివైజ్‌ను కదిపితే, షేర్‌ రిక్వెస్ట్‌ వెళుతుంది. దానికి ఆమోదం తెలిపితే, వెంటనే ఫైల్‌ షేరింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వాట్సాప్ ఛానల్​ ఫీచర్స్
WhatsApp Channel Features : వాట్సాప్​ ఛానల్స్ కోసం కూడా పలు నయా ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వాయిస్​ అప్​డేట్స్​, పోల్స్​, షేర్​ టు స్టేటస్​, మల్టిపుల్ అడ్మిన్స్​ ప్రధానమైనవి.

  • వాయిస్ అప్​డేట్స్​ : ఈ ఫీచర్​ ద్వారా ఛానల్ అడ్మిన్స్ తమ ఫాలోవర్లకు వాయిస్​ మెసేజ్​లు పంపించవచ్చు.
  • పోల్స్ : ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్​ ఛానల్స్​ తమ యూజర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్స్ నిర్వహించుకోవచ్చు.
  • షేర్ టు స్టేటస్​ : ఈ ఫీచర్​ ద్వారా వాట్సాప్​ ఛానల్స్​లోని మెసేజ్​లను, యూజర్లు తమ స్టేటస్​గా పెట్టుకోవచ్చు.
  • మల్టిపుల్ అడ్మిన్స్​ : ప్రొఫెషనల్ ఛానల్స్​ను నిర్వహించేందుకు ఒక అడ్మిన్ సరిపోడు. అందువల్ల వాట్సాప్​ ఛానల్ మెయింటైన్ చేయడానికి చాలా మంది అడ్మిన్లు అవసరం అవుతారు. అందుకోసమే వాట్సాప్ ఈ మల్టిపుల్ అడ్మిన్స్​ ఫీచర్​ను తీసుకువచ్చింది.

రూ.20 వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే!

గూగుల్ పే చెల్లింపుల్లో సమస్యాలా? ఈ మూడు టిప్స్ మీకోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.