ETV Bharat / state

పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం - అత్యధికంగా విజయవాడలోనే - High Taxes on People

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:45 PM IST

Updated : Apr 18, 2024, 5:50 PM IST

taxes_on_people
taxes_on_people

YCP Govt Imposing High Taxes on People of Vijayawada: పెరిగన ధరలు, ఉపాధి అవకాశాలు మెండుగా లేక రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వివిధ రకాల పేర్లతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. ఆస్థిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, చెత్తపన్ను, ఇంటిపన్నుల పేరుతో సామాన్యుడిని జగన్ సర్కార్ పూల్చి పిప్పి చేస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలపై గత మూడేళ్ల వ్యవధిలోనే సుమారు 328 కోట్ల రూపాయల భారం వైసీపీ ప్రభుత్వం వేసింది.

పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం - అత్యధికంగా విజయవాడలోనే

YCP Govt Imposing High Taxes on People of Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ విచ్చలవిడిగా పన్నులు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తోంది. వైసీపీ పాలనలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, చెత్తపన్ను, ఇంటిపన్ను భారీగా పెంచి సామాన్యులను పీల్చిపిప్పి చేస్తోంది. మూడేళ్ల వ్యవధిలోనే సుమారు 328కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల బాదుడుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘నవరత్నాల’తో మురిపిస్తామంటూ మాయమాటలు - పింఛన్​ తొలగించి పేదలకు వంచన - Jagan Conditions on Pensions

వైసీపీ పాలనలో పన్నుల భారాలపై విజయవాడ నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మూడేళ్ల వ్యవధిలో నగర ప్రజలపై ఆస్తి పన్ను మీదే ఏకంగా 67.59 కోట్ల రూపాయల వరకూ భారం మోపారు. ఏటా 15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుకుంటూ పోయారు. ఆస్తిపన్ను భారం చాలదన్నట్టు యూజర్ ఛార్జీల పేరుతోనూ భారం మోపారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో యూజర్ ఛార్జీలు 18కోట్ల రూపాయలు వసూలు చేయాలని పాలక మండలి లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని కాలనీల్లో కార్పొరేషన్‌ సిబ్బంది పింఛన్ల నుంచి యూజర్‌ ఛార్జీలను మినహాయించుకుని మిగిలిన నగదును లబ్ధిదారులకు చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరించి మరీ ప్రజల నుంచి వీఎంసీ సిబ్బంది చెత్తపన్ను వసూలు చేశారు.

ప్రభుత్వాస్పత్రుల్లో అస్తవ్యస్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు - పరికరాల మరమ్మతులకు నిధుల కొరత - Equipments shortage Govt hospitals

విజయవాడ నగరాభివృద్ధిపై గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు విడుదల చేసింది. జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న హామీలే తప్ప ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు. దీంతో నగరపాలక సంస్థ భారీగా పన్నులు పెంచేస్తూ నిధులు సమకూర్చుకుంటోంది. ఒకవైపు ఆస్తిపన్ను పెంచుతూ మరోవైపు ఖాళీ స్థలాలు, నీటిపన్ను, భూగర్భ డ్రైనేజీ పన్నులను సైతం భారీగా పెంచేశారు. పెరిగిన పన్నులు కట్టలేక ఖాళీ స్థలాల యజమానులు చిరునామాలు సైతం మార్చేసి తిరుగుతున్నారు. విరామం లేకుండా భారాలు మోపుతున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. ప్రజలపై భారీగా భారం వేసి పీడించకుండా నగరపాలక సంస్థ ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు.

వైసీపీ పాలనలో అటకెక్కిన పట్టణాభివృద్ధి - ప్రగతి పనులను పట్టించుకోని జగన్​ - NO DEVELOPMENT IN YSRCP REGIME

ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మబలికి ఓట్లు వెయ్యించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్లు వేసిన పాపానికి ఆ ప్రజలను పన్నుల పేరుతో ఎడాపెడా మోత మోగిస్తున్నారు. తాము ఈ ఆర్థిక భారం మోయలేము మహా ప్రభో అని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేసినా వారి బాధను పెడచెవిన పెట్టి పన్నుల మోత మోగిస్తునే సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగించేశారు. గత నాలుగేళ్లు పన్నుల మోతతో విసుగెత్తిపోయిన ప్రజలు మరో నెల రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ కి ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ప్రభుత్వం ప్రజలపై భారాలు వెయ్యకుండా పాలన సాగించాలని కోరుతున్నారు. ప్రజలపై భారీ స్థాయిలో భారాలు వేసి పీడించకుండా ఇతర ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేసించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated :Apr 18, 2024, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.