ETV Bharat / state

తుది దశకు రాష్ట్ర బడ్జెట్ కసరత్తు - గ్యారంటీల అమలుకే పద్దులో ప్రాధాన్యం!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 7:06 AM IST

Telangana Budget 2024-25 : రాష్ట్ర బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరుకుంది. శాఖల వారీగా ప్రతిపాదనలపై సమీక్షలు పూర్తి కాగా, పద్దు ఖరారు కావాల్సి ఉంది. గ్యారంటీల అమలుకే పద్దులో ప్రాధాన్యం దక్కనుంది. కేంద్రంలో మధ్యంతర బడ్జెట్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Telangana Budget 2024
Telangana Budget 2024
తుది దశకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కసరత్తు

Telangana Budget 2024-25 : వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక వారం రోజుల్లో వెల్లడి కానుంది. 2024-2025 తెలంగాణ బడ్జెట్‌ను వచ్చే శనివారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వార్షిక పద్దుపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. శాఖల వారీ అవసరాలు, ప్రాధాన్యతలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేసే విషయమై అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.

Telangana Govt Exercise on Budget 2024 : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టత లభించింది. బడ్జెట్‌కు సంబంధించి తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చర్చించి పద్దుపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - కేంద్రం నుంచి వచ్చే నిధుల ఆధారంగా కేటాయింపులు

Vote on Account Budget in Telangana 2024 : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుపైనే ఎక్కువగా దృష్టి సారించనుంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామన్న దానికి అనుగుణంగా నిధులు కేటాయించనున్నారు. వాటితో పాటు ఇతర గ్యారంటీలు, ఉద్యోగ నియామకాలకు నిధులు ప్రతిపాదించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలోనూ అదే తరహాలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆదివారం కేబినేట్ మీటింగ్ : మరోవైపు ఆదివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet Meeting) సమావేశం కానుంది. ఎన్నికల సందర్భంగా హస్తం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా, మరో రెండింటి అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినేట్‌లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు సమాచారం.

నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!

Telangana Cabinet Meeting For Budget Sessions 2024 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపైనా కేబినేట్ చర్చించనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించనున్నారు. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 10న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. 11న ఆదివారం సెలవు. తిరిగి 12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభమవుతాయి.

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.