ETV Bharat / state

సీపీఎస్​పై జగన్​ హామీ అమలు చేయలేదన్న ఉపాధ్యాయులు - సస్పెన్షన్​ వేటు - Teachers Problems in YSRCP Regime

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 8:05 AM IST

Teachers_Problems_in_YSRCP_Regime
Teachers_Problems_in_YSRCP_Regime

Teachers Problems in YSRCP Regime: ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పడమే వారు చేసిన తప్పు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని సస్పెండ్‌ చేశారు. సమస్యలను పత్రికాముఖంగా చెప్పుకున్నందుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Teachers Problems in YSRCP Regime: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం జగన్‌ మంచివారట. పాదయాత్రలో సీపీఎస్‌పై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఉపాధ్యాయులు అనడం మాత్రం తప్పట. వారు ప్రభుత్వంపై విధేయత చూపలేదట. ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించారట. ఇలా పలు కారణాలతో అనంతపురం జిల్లాలో ఉద్యోగ సంఘ నేతలు విజయభాస్కర్‌, హరికృష్ణలను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇచ్చారు.

ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అసలు ఉపాధ్యాయులు ఏ పార్టీ జెండానూ పట్టుకుని ఎక్కడా ప్రచారం చేయలేదు. ప్రభుత్వాన్నీ విమర్శించలేదు. పత్రికాముఖంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే వారికి భావప్రకటనా స్వేచ్ఛ సైతం లేదా? కరపత్రాలు, ఓ పార్టీ జెండాలు పట్టుకుని పక్కా కార్యకర్తల్లా బహిరంగంగానే ఎన్నికల ప్రచారం చేసే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తే, దాని ఆధారంగా ఏకపక్షంగా ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం ఏమిటి? సీపీఎస్‌ రద్దు చేయలేదని, సకాలంలో జీతాలు రావడం లేదని చెప్పడం కూడా ఉల్లంఘననేనా?

రాష్ట్రంలో ఐదేళ్లుగా బానిసల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలు - United form Round Table Meeting

వేతనాలు అందడం లేదు అనేది ‘జగ’మెరిగిన సత్యం: వైసీపీ ప్రభుత్వంలో 1వ తేదీన వేతనాలు అందడం లేదు అనేది ‘జగ’మెరిగిన సత్యం. దేశంలోనే ధనిక సీఎం అయిన జగన్‌కు ఇదేమీ ఇబ్బంది కాకపోవచ్చు కానీ, నెలనెలా జీతపు రాళ్లపైనే ఆధారపడే ఉద్యోగులకు మాత్రం పూట గడవడం కూడా కష్టమే. ఆ కష్టం ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు హరికృష్ణ సైతం అదే విషయాన్ని చెప్పారు. ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని, అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేస్తుంటే ఏపీలో జీపీఎస్‌ ప్రవేశ పెట్టారని అన్నారు. రెండేళ్లయినా పీఎఫ్‌ రుణాలు మంజూరు కాలేదని తెలిపారు. ఉద్యోగవర్గాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చెప్పడమే అధికారుల దృష్టిలో తప్పైపోయింది.

సీపీఎస్‌ రద్దు చేయలేదని చెప్పినందుకు: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక దీన్ని పట్టించుకోలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్నే ఉపాధ్యాయుడు విజయభాస్కర్‌ తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేయలేదని తన అభిప్రాయాన్ని పత్రికకు తెలిపారు. ఉద్యోగులు మానసికంగా పడుతున్న సమస్యలను చెప్పడమే అధికారుల దృష్టిలో తప్పయిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారే తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడంగానీ, రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనడంగానీ వారు చేయలేదు. అభిప్రాయం చెప్పినందుకు సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో ప్రైవేట్​ టీచర్లపై ఎక్కడ లేని ప్రేమ - పదవీకాలం ముగుస్తున్నా పట్టించుకోని జగన్​ - Jagan Govt Cheated Private Teachers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.