ETV Bharat / state

జగన్ రెడ్డి భూదాహానికి బీసీ కుటుంబం బలి- ఇంకోసారి సీఎం అయితే ప్రజలు బతికే పరిస్థితి లేదు: టీడీపీ - Family Suicide in Ysr District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 10:43 PM IST

TDP Leaders Fire On CM Jagan: వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే వైఎస్సార్ జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆస్తులను కబ్జా చేశారని ప్రశ్నించిన వారిని బలి తీసుకుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ భూ దాహానికి చేనేత కుటుంబం బలైపోయిందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.

TDP Leaders Fire On CM Jagan
TDP Leaders Fire On CM Jagan

TDP Leaders Fire On CM Jagan : వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే వైఎస్సార్ జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయిందని మండిపడ్డారు. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారని విమర్శించారు. బీసీలంటే జగన్ రెడ్డికి గిట్టదని అచ్చెన్న ఆరోపించారు. ఐదేళ్లుగా బీసీల ఆస్తులను కబ్జా చేస్తు, బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కేస్తున్నారని వాపోయారు. బీసీలపై దమనకాండ ఆపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు భూదాహంతో బలవన్మరణానికి పాల్పడిన చేనేత కుటుంబ సభ్యులను 25వ తేదీ తెలుగుదేశం కమిటీ పరామర్శించి భరోసా ఇవ్వనుందని తెలిపారు.

Family Suicide in YSR District : జగన్ రెడ్డి భూ దాహానికి చేనేత కుటుంబం బలైపోయిందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ బలవన్మరణం బాధాకరమని వాపోయారు. వైఎస్సార్సీపీ నేతలు వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని పేట్రేగిపోతున్నారు మండిపడ్డారు. కొందరు అధికారుల అండతో భూముల రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ రౌడీ మూక వేధింపులను ఆ కుటుంబం తట్టుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆమె తేల్చి చెప్పారు.

వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు - DSP on Subbarao family Suicide

Triple Suicide in Kadapa : భూహక్కు చట్టం ద్వారా కూడా హత్యలు చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. సొంత భూమి కబ్జాకి గురికావడం చూసి ఆ కుటుంబం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని, వైసీపీ నేతలు రాక్షసుల్లా రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక నిందితులను శిక్షిస్తామని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి దురాగతాలకు బడుగు, బలహీన వర్గాలు బలవుతున్నాయి మంగళగిరి టీడీపీ సమన్వయ కర్త నందం అబద్ధయ్య దుయ్యబట్టారు. ఇంకెంతమంది బడుగులను పొట్టన పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.

వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది: చంద్రబాబు - Chandrababu on Family Suicide

వైసీపీ భూదాహానికి బీసీలు బలి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలంగానే బీసీ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పద్మశాలి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ భూదాహానికి బీసీలు బలి అవుతున్నారని ఆరోపించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే బీసీలు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేతలు అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి వస్తే ప్రజల ఆస్తులకు ఎలాంటి రక్షణ ఉండదని నేతలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు.

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three People Commit Suicide

జగన్ రెడ్డి భూదాహానికి బీసీలు బలి - ఇంకోసారి సీఎం అయితే ప్రజలు బతికే పరిస్థితి లేదు : టీడీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.