ETV Bharat / state

'బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు - ఖర్చు పెట్టడానికి నిధులు లేవు '

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 7:17 PM IST

TDP Janasena leaders criticized Jagan: తెలుగుదేశం పార్టీ - జనసేన నిర్వహించిన జయహో బీసీ సభలో టీడీపీ- జనసేన నేతలు మాట్లాడారు. సీఎం జగన్ బీసీలను మోసం చేశారని ఆరోపించారు. బీసీలకు గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. టీడీపీ ద్వారా బీసీ అనే పదానికి గుర్తింపు వచ్చిందన్నారు. వెనుకబడిన వర్గాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని ఇరుపార్టీల నేతలు ఆరోపించారు.

TDP Janasena leaders criticized Jagan
TDP Janasena leaders criticized Jagan

TDP Janasena Leaders Criticized Jagan: సీఎం జగన్​ బీసీలను మోసం చేశారని జయహో బీసీ కార్యక్రమంలో టీడీపీ - జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లకి మోసే బీసీలను పల్లకి ఎక్కించి గౌరవించిన నేత ఎన్టీఆర్ అని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. బీసీలకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించిన నేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తన బీసీలు అని చెప్పుకునే హక్కు ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది తప్పా, జగన్ కు ఎంత మాత్రం లేదని తేల్చిచెప్పారు.

బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు: రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించేది బీసీలేనని పితాని సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు మొదట్నుంచీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కానీ సీఎం జగన్ మాత్రం 56 కార్పొరేషన్ల పేరుతో బీసీలను మోసం చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవని పితాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్​కు మీడియా సమావేశం పెట్టే ధైర్యం లేదని పితాని విమర్శలు గుప్పించారు.

వెనకబడిన వర్గాల్లో జగన్ చిచ్చు: వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వెనుకబడిన వర్గాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయ నేతలుగా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పరిపాలనలో బీసీ నేతలను భయపెట్టి వేధిస్తున్నారని కొణతాల ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదని విమర్శించారు. భూములు ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డుపైకి తెచ్చారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.

వాలంటీర్లను తొలగించం- వివేక హత్యపై పూటకోమాట! చర్చకు సిద్దమా ?: చంద్రబాబు

బీసీ యువత భవిష్యత్తును నాశనం: సమాజంలో సగానికి పైగా బీసీలమే ఉన్నామని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అండగా ఉండాల్సిన అవసరం వచ్చిందని ప్రజలకు కాలవ పిలుపునిచ్చారు. దుర్మార్గమైన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన మసయం వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం వైపు చూడకుండా జగన్‌ను తరిమేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. జగన్ బీసీ యువత భవిష్యత్తును నాశనం చేశారని కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందలం ఎక్కించాలన్నా, దించాలన్నా: జయహో బీసీ అంటే, వెనుకబడిన కులాల ఆత్మగౌరవం అని కూన రవికుమార్‌ తెలిపారు. అందలం ఎక్కించాలన్నా, దించాలన్నా, అది బీసీల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. బీసీలు వెన్నెముక అంటూనే జగన్‌ మన వెన్నెముక విరిచారని విమర్శించారు. బీసీలకు అండగా ఉన్న అనేక పథకాలను జగన్‌ నిలిపేశారని రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జయహో బీసీ బహిరంగ సభ - "బీసీ"లకు భరోసాగా డిక్లరేషన్‌ ప్రకటన!

బీసీ అనే పదానికి గుర్తింపు: బీసీల్లో ఏ కులస్థుడిని అడిగినా గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధా స్పష్టం చేశారు. లక్ష మంది చేనేతలకు 2వేల రూపాయలు ఇచ్చింది చంద్రన్న అని కొనియడారు. బీసీ అనే పదానికి గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీలోనేనని పొలిట్ బ్యూరోసభ్యులు కిమిడి కళావెంకట్రావు స్పష్టం చేశారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ఎక్కడ బీసీలున్నారని గుర్తించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లడించారు.

బీసీల వెన్ను విరుస్తుంది: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే బీసీలు అభివృద్ధి చెందారని పార్టీ నేతలు గౌతు శిరీష, బీదా రవిచంద్ర యాదవ్‌ స్పష్టం చేశారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అయితే, వైఎస్సార్సీపీ బీసీల వెన్ను విరుస్తుందని మండిపడ్డారు. బీసీల సమస్యల గురించి పోరాటం చేసే ఒక్క నాయకుడైనా వైఎస్సార్సీపీలో ఉన్నాడా అని నిలదీశారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వం అధికారంలోకి రావాలని నేతలు ఆకాంక్షించారు. నాలుగేళ్ల 10 నెలల కాలంలో బలహీనులపై అనేక అక్రమాలు, దోపిడీలు, హత్యలు జరిగాయని ఆరోపించారు.

వైఎస్సార్సీపీకి మరో షాక్​, మంత్రి గుమ్మనూరు రాజీనామా - "జగన్ గుడిలో విగ్రహం లాంటివారు!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.