ETV Bharat / state

ఆ సారుకు జీవితాంతం గుర్తుండేలా సర్​ప్రైజ్ ప్లాన్​ చేసిన విద్యార్థులు​ - పదవీ విరమణలో అదిరిపోయే గిఫ్ట్​ - Students Gift Car to Teacher

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 4:50 PM IST

students_gift_car_to_teacher_in_palnadu_district
students_gift_car_to_teacher_in_palnadu_district

Students Gift Car to Teacher in palnadu District : ప్రతి విద్యార్థి జీవితంలో గురువుది అత్యంత కీలకమైన పాత్ర. పుస్తకంలోని పాఠాలతో చెప్పడంతోపాటు జీవిత పాఠాలను కూడా నేర్పించే బాధ్యత తీసుకుని విద్యార్థుల్లో ఉన్నత భావనలు పెంపొందేలా తయారు చేస్తారు గురువులు. అలాంటి గొప్ప మనసుండే ఓ గురువుకు పదవీ విరమణ సందర్భంగా శిష్యులు ఒక బహుమానంతో సర్‌‌ప్రైజ్ చేశారు. ఆ కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్​ చదవాల్సిందే.

Students Gift Car to Teacher in palnadu District : ప్రతి విద్యార్థి జీవితంలో గురువుది అత్యంత కీలకమైన పాత్ర. పుస్తకంలోని పాఠాలతో చెప్పడంతోపాటు జీవిత పాఠాలను కూడా నేర్పించే బాధ్యత తీసుకుని విద్యార్థుల్లో ఉన్నత భావనలు పెంపొందేలా తయారు చేస్తారు గురువులు. అలాంటి గొప్ప మనసుండే ఓ గురువుకు పదవీ విరమణ సందర్భంగా శిష్యులు ఒక బహుమానంతో సర్‌‌ప్రైజ్ చేశారు. ఆ కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్​ చదవాల్సిందే.

రిటైర్డ్ టీచర్​కు రూ.2లక్షల 'గోల్డ్​ నెక్లెస్​' గిఫ్ట్​- పూర్వ విద్యార్థుల సర్​ప్రైజ్

జీవితంలో ఉన్నత స్థానాలకు అదిరోహించేలా తమలో స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు ఏకంగా కారును బహుమతిగా ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్‌ ఆర్ట్స్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు . గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పని చేస్తున్నారు. ఈయన ఏప్రిల్‌ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

యూట్యూబ్​ ఫాలోవర్స్ కోసం క్వశ్చన్ పేపర్​ లీక్ - గవర్నమెంట్ టీచర్ అరెస్ట్ - Youtube Paper Leak In Odisha

ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్‌ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, ఇతర అధ్యాపకులు లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్‌ దంపతులను సత్కరించారు. గురువుకు శిష్యుల్ ఇచ్చిన కారు విలువ ఏకంగా రూ.12లక్షలు కాగా విద్యార్థుల తమ గురువుకు దాన్ని అందించి వారిలో జేమ్స్​ నింపిన స్పూర్తిని గురించి వివరించారు.

ఏఐ టీచర్​ 'ఐరిస్'​- ఏ ప్రశ్నకైనా 10సెకన్లలో జవాబు- పిల్లలకు ఫేవరేట్​!

అనంతరం పూర్వ విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ సలూరి నరసింహారావు, అధ్యాపకులు ఆదినారాయణ, లేపాక్షి అల్యూమినా అసోసియేషన్ అధ్యక్షులు వేమ నారాయణ, సంయుక్త కార్యదర్శి విజయసుందర్, కుల్లాయప్ప,సోమ శంకర్, చక్రి, కార్యదర్శి రాజారెడ్డి. సభ్యులు శ్యామసుందర్, రవిప్రసాద్, జనార్దన్లు జేమ్స్ దుపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయుడు జేమ్స్ మాట్లాడుతూ నవోదయలో ఉపాధ్యాయుడిగా పనిచేయడు తన పూర్వజన్మ సుకృతమన్నారు. మరోసారి అవకాశమిస్తే విద్యార్థులు సేవ చేస్తానన్నారు.
బెత్తంతో టీచర్​కు పనిష్మెంట్- తప్పు చేసిన స్టూడెంట్స్​ మాత్రమే కొట్టాలి- ఎక్కడో తెలుసా? - STUDENTS PUNISHED TEACHER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.