ETV Bharat / state

పీఎస్‌లో జడ్పీటీసీ భర్త డ్యాన్స్‌ ఘటనపై ఎస్పీ చర్యలు - ఎస్సై వీఆర్‌కు అటాచ్‌, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ - SP on Police for Dance in Station

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 9:46 PM IST

SP take Action on Police for ZPTC Husband Dance in Station
Etv BharatZPTC Husband Dance in Police Station

SP take Action on Police for ZPTC Husband Dance in Station : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ పీఎస్‌లో జడ్పీటీసీ భర్త డ్యాన్స్‌ చేసిన ఘటనపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్సై కె.ప్రసాద్‌ను వీఆర్‌కు జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.

SP take Action on Police for ZPTC Husband Dance in Station : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ పోలీస్​ స్టేషన్​లో ఓ సినిమా పాటకు స్టెప్పులు వేసిన జడ్పీటీసీ భర్త శ్రీనివాస్‌ వైరల్​ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు ఠాణా పోలీసులపై ఎస్పీ కిరణ్ ఖరే చర్యలు చేపట్టారు. ఎస్సై కె.ప్రసాద్​ను​ వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్‌ను సస్పెండ్​ చేశారు. ఇవాళ జిల్లాలోని మహాదేవపూర్ పోలీస్​ స్టేషన్​లో స్థానిక జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది.

రాష్ట్ర వ్యాప్తంగా- చర్చనీయంశం : ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారంగా మారింది. పోలీస్ స్టేషన్​లో ఓ రాజకీయ నాయకుడు ఇలా వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విసృత్తంగా ప్రచారం అయ్యింది. నెటిజన్లతో పాటు పలువురు ఈ ఘటనపై తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెట్టారు. నిత్యం ప్రజలు తమ బాధలను చెప్పుకోడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుంటే, జడ్పీటీసీ భర్త శ్రీనివాస్‌ మాత్రం డాన్స్‌ చేయడానికి వెళ్లాడంటూ పలువురు విమర్శించారు. కేసులతో హడావుడిగా ఉండే పోలీస్​ స్టేషన్​ డ్యాన్స్​ క్లబ్​గా మారిందంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేశారు.

ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారడంతో దీనిపై జడ్పీటీసీ భర్త శ్రీనివాస్ మాట్లాడారు. ఆరోగ్యకరంగా ఉండానికి మార్నింగ్​ వాక్​లో భాగంగా అనారోగ్య సమస్యలు పరిష్కారం, ఒత్తిడి వాతావరణం, శారీరక శ్రమ, ప్రశాంతంగా ఉండాలని తెలియజేయడానికే పోలీస్​ స్టేషన్​లో డ్యాన్స్ చేసినట్లు జడ్పీటీసీ భర్త శ్రీనివాస్​ తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఉత్తేజ పరచడానికి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో డ్యాన్స్​ చేశానని వివరించారు. కొంత మంది వక్రీకరించి దురుద్దేశంతో ఇలా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

'ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, ఒత్తిడిని తగ్గించుకోవాలని డ్యాన్స్​ చేసి అధికారులకు వివరించా. కాని తప్పుడుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారు.'- శ్రీనివాస్, జడ్పీటీసీ భర్త

ZPTC Husband Dance in Police Station : ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో స్థానిక జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చర్యలు తీసుకున్నారు. మహాదేవపూర్ ఎస్సై కె.ప్రసాద్​ను వీఆర్​కు అటాచ్డ్ చేశారు. స్టేషన్ ఇన్​ఛార్జిగా ఉండి, విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలలో పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా పనితీరు ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే ఓ ప్రకటనలో తెలిపారు.

పీఎస్‌లో జడ్పీటీసీ భర్త డాన్స్‌ ఘటనపై ఎస్పీ చర్యలు - ఎస్సైను వీఆర్‌కు అటాచ్‌, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

పోలీస్​ స్టేషన్​లో​ జడ్పీటీసీ భర్త డ్యాన్స్​ - వైరల్​ అవుతున్న వీడియో - ZPTC Husband Dance in Station

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.