ETV Bharat / state

అమ్మో, ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇన్ని పరీక్షలా!- విద్యార్థుల్లో మానసిక సంఘర్షణ - Engineering Entrance Exams

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 10:05 AM IST

Psychological Conflict in Students for Engineering Entrance Exams: ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు. బీటెక్‌ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోండగా వాటికి సన్నద్ధమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నీట్‌లా జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యార్ధులు, విద్యా వేత్తలు కోరుతున్నారు.

engineering_entrance_exams
engineering_entrance_exams (ETV Bharat)

Psychological Conflict in Students for Engineering Entrance Exams: ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఇంటర్ విద్యార్ధులు రెండో ఏడాదంతా ఒత్తిడిలోనే గడుపుతున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న మాదిరిగా ఇంజినీరింగ్‌కు సైతం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తున్నా అమల్లోకి రావడం లేదు. బీటెక్‌లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల దరఖాస్తులకే 10 వేలకుపైగా ఖర్చవుతున్నాయి.

రాష్ట్రంలో నాణ్యమైన ఇంజినీరింగ్‌ కళాశాలలు తక్కువగా ఉండటంతో వాటిల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఒక దాంట్లో సీటు రాకపోతే మరో దాంట్లోనైనా సాధించాలన్న ఒత్తిడి పిల్లలపై ఉంటోంది. ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి కొంచెం మంచివి అనుకున్న వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే రాయితీ ఇస్తామంటూ ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు ప్రకటనలు చేస్తుండడంతో విధిగా వాటిని రాయాల్సి వస్తోంది.

పావలా పెట్టుబడికి రూపాయి ప్రోత్సాహకాలా?- ఆ సంస్థపై జగన్​ సర్కార్​కు ఎంత ప్రేమో! - GOVT INCENTIVE FOR INDOSOL

అమ్మో, ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇన్ని పరీక్షలా!- విద్యార్థుల్లో మానసిక సంఘర్షణ (ETV Bharat)

ఇంటర్ రెండో ఏడాది మొదటి నుంచే అటు అకడమిక్‌ ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. జనవరి, ఏప్రిల్‌ నెలల్లో ఒకసారి జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికీ రాష్ట్రంలో చాలా మంది హాజరవుతున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈఏపీసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉంటున్నాయి. ఇవి పూర్తికాకుండానే బిట్స్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ వస్తుంది. ఈఏపీసెట్‌కు ముందే ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్‌ వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొంతమంది తెలంగాణ ఈఏపీసెట్‌ను సైతం రాస్తారు. వీటన్నింటికీ దరఖాస్తు చేసి, రాసేందుకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

'పోలీసులమని మర్చిపోయారు'- తాడిపత్రి అల్లర్లలో ఏఆర్‌ అదనపు ఎస్పీ, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐపై వేటు - Actions on ARAdditionalSP and SB CI

నీట్‌లా జాతీయస్థాయిలో ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉంది. జేఈఈ మెయిన్స్‌ తరహాలోనే ఒక్కటే పరీక్షతో జాతీయ, రాష్ట్రాల విద్యా సంస్థలు, వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థులు ఏడాది పొడవునా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఇబ్బంది ఉండదు. ఈ దిశగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గతంలో కమిటీ సైతం ఏర్పాటు చేసింది. కానీ, నిర్ణయం తీసుకోలేదు. ఒకేసారి అకడమిక్, పోటీ పరీక్షల సిలబస్‌లు చదవాల్సి రావడంతో పిల్లల్లో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. దాన్ని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధ్యాపకులు చెబుతున్నారు.

బిట్స్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొన్ని ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ పరీక్షల కంటే ముందే వాటిని పెడుతుండగా, మరికొన్ని తర్వాత నిర్వహిస్తున్నాయి. ఏపీ ఈఏపీసెట్‌ సమయంలోనే బిట్స్‌ ప్రవేశ పరీక్ష ఉంది. ఇలాంటి తరుణంలో దేనికి హాజరు కావాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటికీ కామన్‌ టెస్టే పరిష్కారమని విద్యార్థులు చెబుతున్నారు.

'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్​కు అనర్హుడు' - MLA Pinnelli Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.