ETV Bharat / state

మేడారం జాతరలో ధరల మోత - లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే షాక్?

Medaram Jatara Goods Price 2024 : మేడారం మహాజాతరకు భక్తుల తాకిడి మొదలయ్యింది. అమ్మవార్లను పెద్దఎత్తున దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో స్థానిక దుకాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. గిరాకీ పెరగడంతో వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి ధరలను నియంత్రించాలని భక్తులు కోరుకుంటున్నారు.

Medaram Jathara in Telangana
Selling Goods at High Prices in Medaram
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 5:37 PM IST

మేడారంలో ధరల మోత- లీటర్ వాటర్ బాటిల్ ఎంతంటే?

Medaram Jatara Goods Price 2024 : సమక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో మేడారం(Medaram Jathara) పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ నెలకొంది. ఇదే అదునుగా వ్యాపారులు భక్తుల నుంచి అధిక ధరలతో వస్తువులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దర్శనానికి వస్తున్న భక్తులు మాత్రం అధిక ధరలు నియంత్రించాలని కోరుతున్నారు..

Medaram Jathara in Telangana : ఈనెల 21 నుంచి 24 వరకు జరగనున్న ములుగు జిల్లా(Mulugu District) మేడారం మహా జాతరకు ముందే భక్తులు వస్తున్నారు. సమయం దగ్గరపడుతున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల వారూ కుటుంబ సమేతంగా వస్తున్నారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​

ఈ క్రమంలో ఉపయోగించే వస్తువుల ధరలు అమాంతం పెంచేసి వ్యాపారస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. లీటర్‌ మంచి నీళ్ల సీసా ధరను 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన దుకాణదారులందరు అధిక ధరలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. మేడారం మహా జాతర ప్రారంభానికి ముందే ధరలు ఇలా ఉంటే జాతర నాలుగు రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఇక్కడ వస్తువులను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకంటే డబుల్ రేట్​కు అమ్ముతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, మరో పదిరోజుల్లో జరగబోయే జాతరకు ధరలను మరింతగా పెంచేస్తారు. తక్షణమే అధికారులు దృష్టిసారించి సదరు దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలి". - భక్తులు, మేడారం.

Medaram Maha Jatara 2024: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం మహా జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి: జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మహాజాతరకు మరమ్మత్తుల 'బాట' - ముమ్మరంగా కొనసాగుతున్న పనులు

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.