ETV Bharat / state

జనసేన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం- వైసీపీ నుంచి భారీగా చేరికలు - Jana Sena Praja Sankalpa Yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 12:02 PM IST

Jana Sena Praja Sankalpa Yatra
Jana Sena Praja Sankalpa Yatra

Jana Sena Praja Sankalpa Yatra: జనసేన అభ్యర్థులు బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు తలపెట్టిన సంకల్ప ర్యాలీకి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో అభ్యర్థులు పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కొడాలి, చల్లపల్లి, మోపిదేవి మీదుగా అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీకి చెందిన అవనిగడ్డ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

Jana Sena Praja Sankalpa Yatra: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కేడర్ లో ర్యాలీ ఉత్సాహం నింపింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎంఎల్ఏ అభ్యర్ధులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్​ ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ గాంధీ క్షేత్రం వరకు తలపెట్టిన సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది.

30 కిలోమీటర్ల మేర కొనసాగిన ర్యాలీ: శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో అభ్యర్థులు పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కొడాలి, చల్లపల్లి, మోపిదేవి మీదుగా అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అభ్యర్థులకు అడుగడుగునా గజమాలలు, మంగళహారతులతో గ్రామ గ్రామాన ప్రజలు ఘనస్వాగతం పలికారు. గత కొన్ని రోజుల ముందు వరకు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం ఆలస్యం అవడం, రోజుకి ఒక పేరు వినపడటంతో జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగింది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండలి బుద్ధప్రసాద్​కు జనసేన టిక్కెట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో ఒకటి రెండు రోజులు స్థానిక జనసేన నాయకులు వ్యతిరేకించారు. అయితే, జనసేన పార్టీ కేడర్​ను మండలి కొద్ది రోజుల్లోనే ఒకే తాటి పైకి తెచ్చారు.

వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేతల వాయిస్‌ మెసేజ్‌- బాలశౌరి మీటింగ్‌కు వెళ్లిన వారి వివరాలు నోట్‌ చేయాలని ఆదేశం - YCP Leader Voice Message Volunteers

అరాచకపాలనకు అంతం పలకాలి: ఇక యాత్రలో పాల్గొన్న జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక వైసీపీ నాయకత్వం విమర్శలు గుప్పించారు. ఎదురుమొండి వారధి కట్టించి తీరుతానని బాలశౌరి హామీ ఇచ్చారు. అరాచకపాలనకు అంతం పలకాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో పలువురు అవనిగడ్డ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ప్రముఖ వైసీపీ నేత సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో అధికార పార్టీ నుంచి జనసేన పార్టీలోకి భారీ స్థాయిలో చేరికలు కొనసాగాయి. మండలి బుద్ధప్రసాద్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన నాయకులను గజ మాలలతో ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వైసీపీని అంతమెుందించేందుకే కూటమి ఏర్పడింది: మండలి బుద్ధప్రసాద్‌ - mandali buddha prasad comments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.