ETV Bharat / state

గుంతలూరుగా మార్చి బస్సు యాత్రనా జగన్‌ - ఏం చేశావని గుంటూరుకు వస్తున్నావ్‌? - Jagan Cheated Guntur People

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 9:38 AM IST

Jagan Cheated Guntur People by Giving False Promises: ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్నఅనే మాటలు ముఖ్యమంత్రి జగన్‌కు అతికినట్లు సరిపోతాయి. ప్రతిపక్ష నేతగా గుంటూరు జిల్లాలో పర్యటించిన సమయంలో జగన్ ఎన్నెన్నో హామీలిచ్చారు. రైతులు, సామాన్యుల సమస్యలు పరిష్కరించేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. అమరావతిలోని అసైన్డ్ రైతులకు సమాన ప్యాకేజీ అన్నారు. భూమిలేని నిరు పేద కూలీలకు 5వేల పింఛన్‌ అన్నారు. నమ్మి ఓట్లేసిన జనాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ నిండా ముంచారు. హామీలు నెరవేర్చకుండా 'మేమంతా సిద్ధం' అంటూ గుంటూరుకు ఎలా వస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

jagan_cheated_people
jagan_cheated_people

గుంతలూరుగా మార్చి బస్సు యాత్రనా జగన్‌ - ఏం చేశావని గుంటూరుకు వస్తున్నావ్‌?

Jagan Cheated Guntur People by Giving False Promises: 2022 నవంబర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజు గుంటూరు వచ్చి సీఎం జగన్‌ రకరకాల హామీలు ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ పనులకు 287 కోట్ల నిధులిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. గుంతలు పడిన రోడ్లు పూడ్చటానికి కార్పొరేషన్ నిధులే ఉపయోగించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన యూజీడీ పనులు తప్ప ఆ తర్వాత ఒక్కటీ చేపట్టలేదు. బిల్లులు రాలేదని షాపూజీ పల్లోంజి సంస్థ పనులు నిలిపేసి వెళ్లిపోయింది. పనులు పూర్తి కాక గుంటూరు నగరంలో 4 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికీ ఇంటింటికీ సెప్టెక్ ట్యాంకులు పెట్టుకుని డ్రైనేజీ నీటిని అందులోకి వదులుతున్నారు. మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. డ్రైనేజీ సరిగా లేని కారణంగా పైపులైన్లు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితం అవుతోంది. ఇటీవల కలుషిత నీరు తాగి డయేరియాతో నగరంలో నలుగురు చనిపోయి, వందలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేతగా వచ్చిన సమయంలో గుంటూరుని గ్రేటర్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే లేదు. గ్రేటర్‌గా మార్చటం అటుంచితే నగరపాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల్లో తాగునీరు, అప్రోచ్ రోడ్డు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం సమస్యలు పరిష్కరించలేదు. జగన్ ఇచ్చే మాటA నీటిమూటలేనని నగరవాసులు మండిపడుతున్నారు.

వేల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు - వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారి కుట్ర - Fake Votes Registration

అసైన్డ్ రైతులకు సమాన ప్యాకేజీ ఇస్తామంటూ జగన్‌ ఊదరగొట్టారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు నమ్మినట్లే రాజధాని రెండు నియోజకవర్గాల ప్రజలు జగన్ మాట నమ్మారు. తాడికొండ, మంగళగిరిలో వైకాపా అభ్యర్థులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని విధ్వంసం చేశారు. రైతులను కేసులు పెట్టి వేధించారు. భూములేని రైతుకూలీలకు ఎన్నికల్లో లబ్ధి ఎత్తుగడతో కోడ్ వచ్చేందుకు నెల ముందు 5 వేలకు పింఛను పెంచారు. అమరావతిని నాశనం చేసే క్రమంలో మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని మంగళగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫేక్‌ వీడియోలు- హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు - Fake Video in The Name of ETV

గతంలో గుంటూరు ఛానల్ పొడిగించి సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి 2022 జనవరి 1న ప్రత్తిపాడులో పింఛన్ల సొమ్ము పెంపు కార్యక్రమంలో గుంటూరు వాహిని విస్తరణ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. 256 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం బహిరంగ సభలో చెప్పడంతో సమస్య పరిష్కారమవుతుందని భావించారు. హామీ ఇచ్చి 15నెలలు దాటినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

గిట్టుబాటు ధర ఏది జగనన్నా - నిమ్మరైతుల ఆవేదన - Lemon Farmer Problems in AP

గుంటూరులో మైనార్టీలకు కంప్యూటర్ కోర్సులు, డిజిటల్ లైబ్రరీ కోసం ఇస్లామిక్ కౌన్సిల్ భవనాన్ని ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీనీ జగన్‌ నెరవేర్చలేదు. సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ వచ్చే ముందు మంత్రి రజిని హడావుడిగా భవనాన్ని ప్రారంభించారు. కేవలం శ్లాబులు మాత్రమే పూర్తయిన భవనంలో మైనార్టీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేని దుస్థితి ఏర్పడింది. జగన్ ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోకుండా ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని వారంతా ప్రశ్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.