ETV Bharat / state

శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా: వివేకా సతీమణి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 9:16 AM IST

Updated : Mar 15, 2024, 10:50 AM IST

Interview with YS Vivekananda Reddy Wife Sowbhagyamma: రాజకీయ విభేదాలతోనే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ స్పష్టం చేశారు. హంతకులను సీఎం జగన్‌ కాపాడుతున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయన్న సౌభాగ్యమ్మ చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనైనా మంచి నాయకుడు రాష్ట్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నానన్న సౌభాగ్యమ్మ తన రాజకీయ అరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుందని చెప్పారు. జగన్​కు ఓటేయొద్దన్న తన కుమార్తె సునీత అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత సౌభాగ్యమ్మ తొలిసారిగా తన మనసులోని మాటను బయటపెట్టారు.

viveka_murder_case
viveka_murder_case

శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా: వివేకా సతీమణి

Interview with YS Vivekananda Reddy Wife Sowbhagyamma: రాజకీయ విభేదాలతోనే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ స్పష్టం చేశారు. హత్య చేసిన హంతకులను జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయన్న సౌభాగ్యమ్మ చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన భర్త హత్య విషయం బాహ్య ప్రపంచానికి కంటే ముందే జగన్, భారతికి తెలుసని తనకు కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఉదయం హత్య జరిగితే సాయంత్రం దాకా జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తండ్రిని చంపిన హంతకులకు శిక్షపడేందుకు తన కుమార్తె సునీత ఒంటరిగా న్యాయపోరాటం చేస్తుంటే అండగా ఉండాల్సిన జగన్ ఎందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రశ్నించారు.

సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్ల ఇస్తామన్నారు: దస్తగిరి

జగన్​కు ఓటు వేయవద్దు: సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే చివరిక్షణంలో కూడా సునీత జగన్​కు అవకాశం ఇచ్చినా పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన సరిగా లేదని కూల్చడంతోనే పాలన ప్రారంభించి రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్న సౌభాగ్యమ్మ జగన్ సీఎం కావాలని వివేకానందరెడ్డి కలలు గన్నారనే కానీ ఇలాంటి పాలన కోసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనైనా మంచి నాయకుడు రాష్ట్రానికి రావాలని ఆకాంక్షిస్తున్నానన్న సౌభాగ్యమ్మ తన రాజకీయం ఆరంగేట్రం భవిష్యత్తే నిర్ణయిస్తుందని చెప్పారు. జగన్​కు ఓటేయొద్దని తన కుమార్తె సునీత అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు.

జగన్​ వైఎస్​ వివేకాను చంపిందెవరో చెప్పు - ఆ తర్వాతే ఓట్లు అడుగు : చంద్రబాబు

ఒంటరిగా న్యాయ పోరాటం: వాళ్ల దగ్గర అధికారం ఉంది కాబట్టే ఎంపీ అవినాష్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని, న్యాయం జరగకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సీఎం అయ్యాక న్యాయం కోసం మా కుటుంబమంతా జగన్‌ వద్దకు వెళ్లింది. కానీ ఆయన మాతో విడిగా మాట్లాడకుండా, ఇతరుల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారని తెలిపారు. శత్రువులు ఎక్కడోలేరని మా ఇంట్లోనే ఉన్నారని ఆలస్యంగా గ్రహించామని అన్నారు. ఇంక అక్కడ న్యాయం జరగదని తెలిసి అక్కడి నుంచి వచ్చేసి ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నామని సౌభాగ్యమ్మ తెలిపారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కేసు దర్యాప్తు పూర్తవకపోవడం, హంతకులకు శిక్షపడకపోవడంపై సౌభాగ్యమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు: దస్తగిరి

అండగా ఉండాల్సిన అన్న ముప్పుతిప్పలు పెట్టారు: రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడేదాక నా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తుంటే జగన్‌ అండగా ఉండకపోగా ముప్పుతిప్పలు పెడుతున్నారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు చేయాలని డిమాండ్​ చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. పైగా నా కుమార్తె సునీత న్యాయం కోసం జగన్ వద్దకు వెళ్తే అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. వివేకా హత్య విషయంలో నా కుమార్తెను, అల్లుడుని అనుమానించాలని మాట్లాడారని తెలిపారు. హత్యపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేసేటప్పుడు కూడా తనకు సహకరించాలని జగన్‌ను సునీత కోరింది కానీ అతను పట్టించుకోకుండా లెక్కలేకుండా మాట్లాడారని అన్నారు. ఇంక చేసేది ఏమీ లేక సునీత ఒంటరి పోరాటం చేస్తోంది చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు.

Last Updated : Mar 15, 2024, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.