ETV Bharat / state

'న్యాయవాద సంఘాల అధ్యక్షులకు హైకోర్టు నోటీసులు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 12:00 PM IST

High Court notice to Bar Association President
High Court notice to Bar Association President

High Court notice to Bar Association President: ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం 2022ను నిరసిస్తూ న్యాయవాది సంఘాలు విధులు బహిష్కరించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధులను బహిష్కరించడంపై గుంటూరు, విశాఖపట్నం, కడప న్యాయవాది సంఘాల అధ్యక్షులను హైకోర్టు వివరణ కోరింది. ఏ కారణాలతో కోర్టు విధులను బహిష్కరిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

High Court notice to Bar Association President: గుంటూరు, విశాఖ, కడప జిల్లాల న్యాయవాది సంఘాల అధ్యక్షులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం 2022ను నిరసిస్తూ న్యాయవాది సంఘాలు విధులు బహిష్కరించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి ప్రోద్భలంతో సమ్మెకు దిగారు, తదితర వివరాలను అఫివిట్‌ రూపంలో తమ ముందు ఉంచాలని న్యాయవాది సంఘాల అధ్యక్షులను హైకోర్టు ఆదేశించింది.

విచారణను రెండు వారాలకు వాయిదా: కోర్టు విధులను బహిష్కరించడంపై గుంటూరు, విశాఖపట్నం, కడప న్యాయవాది సంఘాల అధ్యక్షులను హైకోర్టు వివరణ కోరింది. వారికి నోటీసులు జారీ చేసింది. ఏ కారణాలతో కోర్టు విధులను బహిష్కరిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఎవరి ప్రోద్భలంతో సమ్మెకు దిగారు, తదితర వివరాలను అఫివిట్‌ రూపంలో తమ ముందు ఉంచాలని న్యాయవాది సంఘాల అధ్యక్షులను హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. కోర్టు విధుల బహిష్కరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలోని వివిధ న్యాయవాదుల సంఘాలు (బార్‌ అసోసియేషన్లు) విధులకు దూరంగా ఉండాలంటూ తీర్మానం చేశారు.
'భూమి హక్కు చట్టం రద్దు చేయాలి' అధికారం కొత్త వ్యవస్థ చేతుల్లోకి వెళ్తుంది : న్యాయవాదుల ఆందోళన

వారికి నోటీసులు: బార్‌ అసోసియేషన్ల తీర్మానాన్ని సవాలు చేస్తూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేశ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విచారణలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున న్యాయవాది జి.వెంకటరెడ్డి వాదనలు వినిపించారు. గుంటూరు న్యాయవాదుల సంఘం మినహా రాష్ట్రంలో అన్ని సంఘాలు సమ్మెను విరమించాయన్నారు. విశాఖ, కడప న్యాయవాదుల సంఘాలు సమ్మె విరమణ విషయంలో సమావేశం నిర్వహించబోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, గుంటూరు, విశాఖ, కడప జిల్లాల న్యాయవాది సంఘాల అధ్యక్షులకు నోటీసులు జారీచేసింది.
ప్రజా ఆస్తులను చట్టబద్దంగా హస్తగతం చేసుకునేందుకే 'భూయాజమన్య హక్కు చట్టం'

న్యాయవాదులు విధులు బహిష్కరించడానికి గల కారణాలు: ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం 2022ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చిందని దీన్ని నిరసిస్తూ న్యాయవాదులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఆస్తి తాకట్టు పెట్టాలన్న, అమ్మాలన్న, గిఫ్ట్ రాయాలన్న టైటిల్ రిజిస్టర్ అథారిటీ అనుమతి ఉండాలని, దేశంలో అత్యున్నత న్యాయస్థానాలు చెప్పిన తీర్పులను కూడా ఈ టైటిల్ రిజిస్టర్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. భూమి యాజమాన్య హక్కు నిర్దేశించే హక్కుని న్యాయస్థానాన్ని కాదని కొత్త వ్యవస్థ చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని న్యాయవాదులు ఆరోపించారు.

న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగేలా యువ న్యాయవాదులు అడుగులు వేయాలి : జస్టిస్ అసనుద్దీన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.