ETV Bharat / state

రంజాన్​ స్పెషల్​ ఫుడ్స్​ ట్రై చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్​లో ఫేమస్ హోటల్స్ ఇవే !

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 3:06 PM IST

Ramadan Food Served Places in Hyderabad: రంజాన్ మాసం మొదలుకావడంతో భాగ్యనగరంలో ఎటు చూసినా హలీమ్ ఘుమఘుమలు ఆహార ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఇవే కాకుండా రంజాన్ నెలలో రుచి చూడాల్సినవి చాలా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ఫుడ్స్ అందించే ఫేమస్ ప్రదేశాల జాబితా మీ కోసం పట్టుకొచ్చాం.

Best Places to Taste Ramadan Foods
Best Places to Taste Ramadan Foods

Best Places to Taste Ramadan Foods in Hyderabad: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది(2024) మార్చి 12 నుంచి ప్రారంభమైంది. ఇక రంజాన్ మాసం మొదలుకావడంతో హైదరాబాద్​లో వీధులన్నీ ముఖ్యంగా పాతబస్తీ సందడిగా మారింది. నగరంలోని ఏ వీధి చూసిన రంజాన్ ప్రత్యేక వంటకంగా చెప్పుకునే హాలీమ్ సెంటర్లు దర్శనమిస్తున్నాయి. అయితే, ఒక్క హాలీమ్ మాత్రమే కాదు.. కబాబ్​ల నుంచి బిర్యానీల వరకు ఎన్నో రుచికరమైన వంటకాలు ఈ మాసంలో లభిస్తాయి. అలాంటి రుచికరమైన రంజాన్(Ramadan 2024) ఫుడ్స్​ను అందించే టాప్ 10 ఫేమస్ హోటల్స్​ హైదరాబాద్​లో ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హోటల్ షాదాబ్ : మీరు రంజాన్ మాసంలో రుచికరమైన ఆహారాల పదార్థాలను తినాలంటే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.. పాతబస్తీలో ఉన్న హోటల్ షాదాబ్. ఇక్కడ చికెన్ కబాబ్​ల నుంచి మటన్ బిర్యానీ, హాలీం వరకు అనేక రకాల ఫుడ్స్ లభిస్తాయి. ఇవి టేస్ట్​లో నిజాం కాలం నాటి వంటకాలను గుర్తు చేస్తాయి. ఇక ఇక్కడ వెజ్ లవర్స్ కోసం ప్రిపేర్ చేసే మిర్చి కా సలాన్ కూడా చాలా ఫేమస్.

  • అడ్రస్ : మదీనా సర్కిల్, హైకోర్టు రోడ్, చార్మినార్, ఘాన్సీ బజార్, హైదరాబాద్.
  • టైమింగ్స్ : 6 am - 12 am.

హోటల్ నయాబ్ : ఇది కూడా నగరంలో రంజాన్ ఫుడ్స్ లభించే ప్రదేశాలలో మరొక అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశం. ఇక్కడ లభించే హాలీమ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఛార్​ కోని నాన్​కు కూడా ఈ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది.

  • అడ్రస్ : నయాపుల్ రోడ్, MI (Xiaomi) షోరూమ్ ఎదురుగా, నాసిర్ కాంప్లెక్స్, చట్టా బజార్, దారుల్​షిఫా, హైదరాబాద్.
  • ఓపెనింగ్ టైమింగ్స్ : 5am -12:30am.

షా గౌస్ : హైదరాబాద్​లోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్​లలో ఒకటి షా గౌస్. మొఘలాయి వంటకాలకు ఇది చాలా ఫేమస్. అలాగే రంజాన్ మాసంలో లభించే ఫుడ్స్ కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకం. రంజాన్ మాసంలో ఈ ప్రదేశం రాత్రిపూట కూడా చాలా బిజీగా ఉంటుంది. షా గౌస్​లో లభించే మటన్ హాలీమ్ చాలా ఫేమస్. అలాగే ఖుబానీ కా మీఠా, షాహీ తుక్డా, ఫిర్నీ వంటి వంటకాలు ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందాయి.

  • ఇది ఉన్న ప్లేస్ : కరాచీ బేకరీ సమీపంలో, రూప్ లాల్ బజార్, సయ్యద్ అలీ చబుత్రా, జోహ్రా కాలనీ, శాలిబండ, హైదరాబాద్.
  • ఓపెనింగ్ టైమింగ్స్ : 12:30 pm - 12:30 am.

పిస్తా హౌస్ : ఇది కూడా రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక ఫుడ్ మెనూను అందిస్తోంది. ఇక్కడ షాహీ తుక్డా, డబుల్ కా మీఠా, షీర్ ఖుర్మా వంటి ఎన్నో రకాల వంటకాలు ఫేమస్. వీటితో పాటు రంజాన్ నెలలో ఇక్కడ ప్రిపేర్ చేసే రంగురంగుల బర్ఫీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

  • ఇది ఉన్న ప్లేస్ : చార్మినార్ రోడ్, శాలిబండ, హైదరాబాద్.
  • ఓపెనింగ్ వేళలు : 11 am - 11:30 pm.

ప్రిన్స్ హోటల్ : మీరు రంజాన్ నెలలో తప్పక సందర్శించాల్సిన మరో ప్రదేశం.. ప్రిన్స్ హోటల్. ఇక్కడ ఖిచ్డీ ఖట్టా ఖీమా చాలా ఫేమస్. దీని కోసం నగరవాసులు క్యూ కడతారు. అత్యంత ప్రసిద్ధ రంజాన్ స్పెషాలిటీలు/స్నాక్స్‌లలో ఒకటిగా పేరుగాంచిన చికెన్ 65ని ప్రిన్స్ హోటల్ అందిస్తోంది. ఇక్కడ లభించే ఆ స్నాక్ ఎంతో ప్రత్యేకం.

  • ఇది ఉన్న ప్రాంతం : మస్జిద్ రోడ్, రాయల్ కాలనీ, మెహదీపట్నం, హైదరాబాద్.
  • ఓపెనింగ్ టైమింగ్స్ : 5 am - 12 am.

4 సీజన్స్ : నగరంలోని టోలిచౌకిలో ఉన్న 4 సీజన్స్ రెస్టారెంట్ కూడా రంజాన్ మాసంలో లభించే ప్రత్యేకమైన ఆహారాలను అందిస్తోంది. అందులో కబ్సా లహమ్ ఇక్కడ చాలా ఫేమస్. అలాగే ఇక్కడ లభించే హలీం, మటన్ బిర్యానీ కూడా ఎంతో రుచిగా ఉంటాయి.

  • అడ్రస్ : ఆర్​టీఏ కార్యాలయం ఎదురుగా, టోలిచౌకి రోడ్, యూసుఫ్ టేక్రి, టోలి చౌకి, హైదరాబాద్.
  • ఓపెనింగ్ వేళలు : 12 pm - 11 pm.

‘మటన్‌ హలీమ్‌’ మన ఫేవరేట్‌

షెహ్జాడే రెస్టారెంట్ : ఇది కూడా రంజాన్ ప్రత్యేక ఫుడ్ మెనూను అందిస్తోంది. చికెన్ బిర్యానీ, ఆఫ్ఘని చాప్, హలీం ఇక్కడ చాలా ఫేమస్. అంతేకాకుండా ఈ రెస్టారెంట్​లో లభించే మరికొన్ని ఫుడ్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి.

  • ఇది ఉన్న ప్లేస్ : యూసుఫ్ టేక్రీ ఎదురుగా, RTA ఆఫీస్ దగ్గర, టోలిచౌకి, హైదరాబాద్.
  • ఓపెనింగ్ టైమింగ్స్ : 11 am - 4 am.

గ్రాండ్ హోటల్ : ముఖ్యంగా రంజాన్ సమయంలో అత్యుత్తమ హైదరాబాదీ, మొఘలాయ్ వంటకాలను కోరుకునే వారికి గ్రాండ్ హోటల్ మరొక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కూడా లభించే వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

  • ఇది ఉన్న ప్లేస్ : బ్యాంక్ స్ట్రీట్, ట్రూప్ బజార్, కోటి, హైదరాబాద్
  • ఓపెనింగ్ టైమ్స్ : 12 pm - 1 am.

కేఫ్ బహార్ : రంజాన్ ప్రసిద్ధ ఆహారాలను అందించే నగరంలోని మరొక ఫేమస్ ప్లేస్.. కేఫ్ బహార్. అలాగే దక్షిణ భారత, ఉత్తర భారత వంటకాలను కోరుకునే ఆహార ప్రియులకు ఇది స్వర్గధామం. మసాలా దోశ, చికెన్ బిర్యానీ వంటి వంటకాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం.

  • ఇది ఉన్న ప్లేస్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్, అవంతి నగర్, హిమాయత్‌నగర్, హైదరాబాద్.
  • టైమింగ్స్ : 11 am - 12 am.

ఇవేకాకుండా నగరంలోని హైటెక్​ సిటీలో ఉన్న కనక్ హోటల్​లో లభించే వంటకాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే రంజాన్ నెలలో తినే ప్రసిద్ధ వంటకాలకు దీనిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

రంజాన్​ మాసంలో కచ్చితంగా టేస్ట్​ చేయాల్సిన ఫుడ్స్​ ఇవే! - హలీమ్​తో పాటు నోరూరించేవి ఇంకెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.