ETV Bharat / state

పిన్నెల్లికి సజ్జల, పోలీసులు అన్ని విధాలా సహకరించారు : జూలకంటి బ్రహ్మారెడ్డి - Julakanti Interview with ETV Bharat

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 1:16 PM IST

TDP Leader Julakanti Brahmananda Reddy Interview: చట్టం, ప్రజాస్వామ్యంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని టీడీపీ మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. ఆయన పరారీ వెనక సజ్జల వంటి పెద్దల సహకారం ఉందని, పోలీసులు కూడా అన్నివిధాలా సహకరించారని ఆరోపించారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటానంటోన్న జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

TDP Leader Julakanti Brahmananda Reddy  Interview
TDP Leader Julakanti Brahmananda Reddy Interview (ETV Bharat)

TDP Leader Julakanti Brahmananda Reddy Interview : ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (YSRCP MLA Pinnelli Ramakrishna Reddy) పారిపోవటానికి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) వంటి ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు పోలీసు అధికారులు కూడా అన్నివిధాలా సహకరించారని మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. చట్టం, ప్రజాస్వామ్యంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని విమర్శించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

'పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టి పిల్లిలా పారిపోయేరా' - పిన్నెల్లిపై నెట్టింట్లో ట్రోల్స్ - Social Media Trolls on Pinnelli

పిన్నెల్లికి సజ్జల, పోలీసులు అన్ని విధాలా సహకరించారు : జూలకంటి బ్రహ్మారెడ్డి (ETV Bharat)

పాల్వాయి, కేపీగూడెం, మాచర్ల దాడులపై నామమాత్రపు సెక్షన్లతో కేసులేంటని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. కేపీగూడెంలో టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనుల్ని కొట్టారని తెలిపారు. అధికార పార్టీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు చలో మాచర్ల (Chalo Macherla) కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవటం ఏంటని ఆయన తప్పుబట్టారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటానంటోన్న జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

పోలీసుల కన్నుగప్పి సినీ ఫక్కీలో పిన్నెల్లి పరార్‌! - ముమ్మరంగా గాలింపు - Pinnelli Ramakrishna Reddy Escaped

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై వెంటనే కేసు పెట్టని అధికారులు - ఎన్నో అనుమానాలు! - MLA Pinnelli Destroying EVM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.