ETV Bharat / state

పార్ట్ టైం ఉద్యోగాల స్కామ్‌ - రూ.32.34 కోట్లు అటాచ్‌ చేసిన ఈడీ - ED attached 32 crores

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 9:39 PM IST

Cyber Crime Fake Jobs in India
ED on Fake Part time Jobs Fraud

ED on Fake Part time Jobs Fraud : పార్ట్​ టైం ఉద్యోగాల స్కాంలో నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్​ చేసినట్లు ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) వెల్లడించింది. ఈ కేసును మనీలాడరింగ్​ చట్టం కింద నమోదు చేసుకున్న ఈడీ, ఉద్యోగాల పేరిట సైబర్​ నేరగాళ్లు రూ.524 కోట్లు దోచుకున్నట్లు గుర్తించింది.

ED on Fake Part time Jobs Fraud : పార్ట్ ​టైం ఉద్యోగాల స్కాంలో సైబర్ నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 32.34కోట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)అటాచ్‌ చేసింది. మొత్తం 580 ఖాతాల్లోని 32.34 కోట్ల రూపాయలు అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. పార్ట్ టైం ఉద్యోగాల మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో నమోదైన 50కి పైగా ఎఫ్‌ఐఆర్​ల(FIR) అధారంగా మనీలాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది. వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలపై ఆశచూపుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు.

ED on Fake Part Time Jobs CyberCrime : హోటళ్లు, టూరిస్ట్ వెబ్‌సైట్లు, రిసార్టులు వంటి వాటికి రేటింగ్ ఇస్తే ఆదాయం వస్తుంది మోసం చేస్తున్నారు. రేటింగ్ ఇవ్వడం ద్వారా రోజుకు రూ.వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించవచ్చని నమ్మబలుకుతున్నారు. స్పందించిన వారితో బోగస్ మొబైల్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేయించి పెట్టుడులు పెట్టిస్తున్నారు. ఆదాయాన్ని వ్యాలెట్‌లో చూపుతున్నారు. వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తే మరికొంత చెల్లించాలని నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కాగా దీనిపై ప్రధానంగా దృష్టి సారించిన ఈడీ యూఏఈ(UAE)లో ఉన్న కీలక సైబర్ నేరగాళ్లు ఇదంతా చేయిస్తున్నట్లు గుర్తించింది.

Cyber Crime Fake Jobs in India : ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి భారత బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును మళ్లిస్తున్నట్లు గుర్తించింది. ఇప్పటివరకూ 175 ఖాతాల ద్వారా రూ. 524 కోట్లు కాజేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును మరో 480 ఖాతాలకు మళ్లించి క్రిప్టో కరెన్సీ(Crypto Currency), హవాలా రూపంలో దేశం దాటిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.

నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని పార్టీ టైం జాబ్​ ద్వారా సంపాదించొచ్చంటూ సైబర్​ నేరగాళ్లు అమాయకులను నమ్మిస్తూ కుచ్చు టోపీ పెడుతున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా సైబర్‌ నేరగాళ్ల వలలో పడటానికి అత్యాశ, అవగాహన లేకపోవడమే ఒక కారణమని నిపుణులు అంటున్నారు. మన అవివేకమే సైబర్ నేరస్థులకు వరంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.

అధిక లాభాలొస్తాయంటూ వల - దోపిడీ సొమ్ముతో హవాలా దందా

సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.